Begin typing your search above and press return to search.
జగన్ తాజా గెలుపు వ్యూహం ఇదే... వైసీపీలో చర్చ ఇదే..!
By: Tupaki Desk | 18 Nov 2022 11:30 PM GMTఎన్నికల్లో ఎలా గెలవాలనే వ్యూహంపై..వైసీపీ తర్జన భర్జన పడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే సంక్షేమం అమలు చేస్తున్నాం.. ప్రతి ఇంటికీ లబ్ధి చేకూరుతోంది.. సో.. తమదే గెలుపు అని సీఎం జగన్ ప్రకటిస్తూ.. వచ్చారు. అంతేకాదు.. ఇంటింటికీ పింఛన్ అందుతోందని, పథకాలు కూడా అందుతున్నా యని.. వారంతా తమకే ఓటు వేస్తారని కూడా చెబుతున్నారు. అయితే.. ఇది నిన్నటి మాట. ఎందుకంటే.. రాష్ట్రంలో ప్రత్యర్థి పార్టీలు వ్యూహాలు మార్చుకుంటున్నాయి.
ఈ నేపథ్యంలో ఏపీసీఎం జగన్ కూడా.. వచ్చే ఎన్నికలకు సంబంధించి వ్యూహాన్ని మార్చుకునే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం దేశంలోనే కీలక చర్చగా మారిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అనుసరిస్తున్న వ్యూహంపై కన్నేసినట్టు సమాచారం. తన సొంత మీడియాకు చెందిన ఇద్దరు కీలక అధికారులను అక్కడ కు పంపించి.. అధ్యయనం చేయిస్తున్నారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఇటు కవరేజ్‌తోపాటు.. అటు రాజకీయంగా బీజేపీ వేస్తున్న ఎత్తులను కూడా తెలుసుకుంటున్నారు.
ఎందుకంటే.. బీజేపీ.. గుజరాత్‌లో 27 సంవత్సరాలుగా అధికారంలో ఉంది. మరి ఇన్ని సంవత్సరాలు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఎలాంటి వ్యూహాన్ని అనుసరిస్తోంది? ప్రభుత్వ వ్యతిరేకతను ఎలా పక్కకు నెడుతోం ది? ప్రజల్లో సానుకూలత పెంచుకునేందుకు బీజేపీ అనుసరిస్తున్న వ్యూహాలపై కూడా.. జగన్ దృష్టి పెట్టినట్టు సమాచారం. దీంతో ఇప్పుడు అదే వ్యూహం ఇక్కడ అమలు చేస్తే ఎలా ఉంటుందని ఆయన భావిస్తున్నారు. అయితే.. అక్కడ బీజేపీ అనుసరిస్తున్న వ్యూహంలో కొన్ని చిక్కులు ఉన్నాయి.
అవేంటంటే.. ఎంత బలమైన నాయకుడైనా.. మోడీకి స్నేహితుడే అయినా.. ప్రజల్లోవ్యతిరేకత ఉన్న కారణంగా.. టికెట్ ఇవ్వలేదు. ఆయనే మాజీ సీఎం విజయ్ రూపాణీ. ఇక, మొత్తంగా 182 మంది సభ్యులన్న అసెంబ్లీ ప్రస్తుతంబీజేపీ సిట్టింగులుగా ఉన్న 68 మంది కీలక నేతలను కూడా పక్కన పెట్టేశారు. వీరికి ప్రజల్లో వ్యతిరేకత ఉన్నట్టు గుర్తించారు. మరి ఇలాంటి సంచలన నిర్ణయాలు జగన్ తీసుకుంటారా? అనేది చూడాలి.
ఎందుకంటే.. ఒక కీలక మంత్రిపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. కానీ, జగన్‌కు ఆయన బంధువు. మరి ఆయనకు టికెట్ ఇవ్వకుండా ముందుకు సాగుతారా? అనేది చూడాలి. ఏదేమైనా సరికొత్త వ్యూహంపై వైసీపీలో చర్చ తీవ్రస్థాయిలోనే జరుగుతుండడం గమనార్హం.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.