Begin typing your search above and press return to search.
ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై కేసీఆర్ జోస్యం ఇదే
By: Tupaki Desk | 1 Feb 2022 5:30 PM GMTఏదైనా అంశంపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోకస్ చేశారంటే.. ఆ అంశాన్ని 360 డిగ్రీస్ లో చూస్తుంటారు. ఏ చిన్న విషయాన్ని మిస్ కాకుండా జాగ్రత్తగా ఫాలో అవుతుంటారు. ప్రతి విషయంలోనూ ఎప్పటికప్పుడు అప్డేట్ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటారు. మొత్తంగా చీమ చిటుక్కుమంటే తనకు వినిపించేలా నెట్ వర్కను సిద్ధం చేసుకుంటారు. మొన్నటివరకు ఓకే కానీ.. ఈ మధ్యన జాతీయ స్థాయిలో బీజేపీ వ్యతిరేక గళాన్ని వినిపించేందుకు గులాబీ బాస్ కేసీఆర్ డిసైడ్ కావటం తెలిసిందే. మోడీ అండ్ కో తీరుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న ఆయన.. తనకు వచ్చిన ఏ చిన్న అవకాశాన్ని విడిచిపెట్టకుండా.. విరుచుకుపడుతున్నారు.
బడ్జెట్ సమావేశాల సందర్భంగా రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరిద్దామని తేల్చిన ఆయన.. అందుకు తగ్గట్లే తన ఎంపీలతో ఆ పనిని విజయవంతంగా పూర్తి చేశారు. కేంద్రంలోని మోడీ సర్కారుకు వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్న ఆయన.. తాజాగా జరుగుతున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై ఆయన ఆసక్తికర వివరాల్ని తమ ఎంపీలతో షేర్ చేసుకున్నట్లుగా తెలిసింది.
ఐదు రాష్ట్రాలకు జరుగుతున్న ఎన్నికల్లో నాలుగు రాష్ట్రాల్లో (యూపీ.. ఉత్తరాఖండ్.. గోవా.. మణిపూర్) బీజేపీ అధికారంలో ఉందని.. ఒక రాష్ట్రం (పంజాబ్)లో కాంగ్రెస్ పవర్లో ఉన్న విషయం తెలిసిందే. అయితే.. ఈ ఐదు రాష్ట్రాల్లోనూ బీజేపీ తన జెండా ఎగురవేయాలన్న పట్టుదలతో ఉందని చెప్పిన కేసీఆర్.. అయితే.. తనకు అందిన సమాచారం ప్రకారం.. ప్రస్తుతం ఐదు రాష్ట్రాల్లోనూ బీజేపీ ప్రతికూల పవనాలు వీస్తున్నట్లుగా జోస్యం చెప్పినట్లుగా తెలుస్తోంది. ఈ ఐదు రాష్ట్రాల్లో బీజేపీ విజయం సాధించటం అంత తేలికైన విషయం కాదని.. బీజేపీపై దేశ వ్యాప్తంగా వ్యతిరేకత ఉందని చెప్పినట్లుగా తెలుస్తోంది.
ఐదు రాష్ట్రాల్లో బీజేపీ ఓడిపోతుందన్న విషయాన్ని నిఘా విభాగాలు నివేదికలు ఇచ్చినట్లుగా చెప్పిన కేసీఆర్.. తనకు ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల నుంచి కూడా వివిధ పార్టీల నుంచి నివేదికలు అందాయని.. వాటిని విశ్లేషించిన తర్వాత.. బీజేపీ ఓటమి గురించి తాను చెబుతున్నట్లుగా కేసీఆర్ చెప్పినట్లుగా సమాచారం. బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే కూటమికి ప్రత్యామ్నాయంగా ఎదగటానికి అనుకూల వాతావరణం దేశంలో ఉందని.. దాన్ని రాజకీయంగా మలచుకోవాల్సిన అవసరం ఉందని కేసీఆర్ చెప్పినట్లుగా చెబుతున్నారు.
ఎన్నికలకు సంబంధించిన కేసీఆర్ జోస్యం పలుమార్లు ఫలించినప్పటికీ.. దుబ్బాక.. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఆయన అంచనాలు తలకిందులుకావటం తెలిసిందే. తాను పాలిస్తున్న రాష్ట్రంలో జరిగిన ఉప ఎన్నికల్లో గెలుపుపై క్లారిటీ లేని కేసీఆర్.. తనకు సదూరాన ఉన్న ఐదు రాష్ట్రాలపై ఆయన అంచనా ఎంతవరకు నిజమే.. కాలమే సరైన సమాధానం ఇవ్వగలదు.