Begin typing your search above and press return to search.

ఈ రాజ‌కీయ‌మే.. వైసీపీకి మేలు చేస్తోంది..!

By:  Tupaki Desk   |   15 Jan 2023 2:30 AM GMT
ఈ రాజ‌కీయ‌మే.. వైసీపీకి మేలు చేస్తోంది..!
X
వైసీపీకి 2019 ఎన్నిక‌ల్లో మేలు చేసిన ప‌రిణామం ఏంటి ? అంటే.. వెంట‌నే అంద‌రూ.. ఆయ‌న పాద‌యాత్ర‌.. వైఎస్ రాజ‌శేఖ‌రెడ్డి సింప‌తీ.. విజ‌య‌మ్మ క‌న్నీరు.. ష‌ర్మిల‌మ్మ‌.. కామెంట్లు.. అని చెబుతారు. వీటిని తోసిపా రేయ‌లేక‌పోయినా.. ఇక్క‌డే మ‌రో కీల‌క కార‌ణం కూడా ఉంది. అది.. రాష్ట్రంలో ప్ర‌త్యామ్నాయ పార్టీగా.. ప్ర‌త్యామ్నాయ నాయ‌కుడిగా ప‌వ‌న్‌ను, జ‌న‌సేన‌ను న‌మ్మ‌లేక‌పోవ‌డం. ఈ రెండు కార‌ణాల‌తోనే వైసీపీ ఘ‌న విజ‌యం ద‌క్కించుకుంది.

మ‌రి దీనిని తెలుసుకున్న త‌ర్వాత‌.. ప‌వ‌న్ ఏంచేయాలి ? అనేది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్నేమీ కాదు. ప్ర‌జ‌ల‌ను త‌న‌వైపు మ‌ళ్లించుకునేందుకు ఆయ‌న త‌న‌ను తాను నిర్మాణం చేసుకోవాలి. ప్ర‌జ‌లు ఎవ‌రినైనా ఎప్పుడు న‌మ్ముతారు? ఎందుకు న‌మ్ముతారు? అంటే.. త‌మ‌కు అందివ‌స్తాడ‌నే బ‌ల‌మైన వ్య‌క్తి అయితే.. త‌మ కోసం నిల‌బ‌డ‌తాడ‌నే త‌డ‌బాటు లేకుంటే ఖ‌చ్చితంగా న‌మ్ముతారు. అంతే త‌ప్ప‌.. ప‌వ‌న్ చెబితేనో.. మాట‌లు పేలిస్తేనో న‌మ్మే ప‌రిస్థితి లేదు.

తాజాగా ప‌వ‌న్ కొన్ని కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. 2019 ఎన్నిక‌ల‌కు ముందు రాజాం నియోజ‌క‌వ‌ర్గంలో తాను స‌భ పెట్టాన‌ని.. ఇస‌కేస్తే కూడా రాల‌కుండా ప్ర‌జ‌లు వ‌చ్చార‌ని.. వారంతా త‌న‌కు ఓటేస్తార‌ని న‌మ్మాన‌ని.. కానీ, తీరా ఎన్నిక‌ల స‌మ‌యానికి హ్యాండ్ ఇచ్చార‌ని అన్నారు. ఇప్ప‌టికైనా త‌న వెనుక నిల‌బ‌డాల‌ని ప‌వ‌న్ చెప్పారు. అయితే.. ఇక్క‌డ న‌మ్మ‌కం అనేది నాయ‌కుడిపై ప్ర‌జ‌ల‌కు క‌లిగేలా.. నాయ‌కుడు ప్ర‌వ‌ర్తించాలి.

అంతేకాదు.. న‌మ్మ‌కం కోసం.. వారి మ‌ధ్య‌లోనే ఉండాలి. కానీ, ప‌వ‌న్‌లో ఈ రెండు ల‌క్ష‌ణాలు లేవు. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు..చంద్ర‌బాబును తిట్టిపోసి.. బీజేపీని తిట్టిపోసి.. మ‌ళ్లీ ఇప్పుడు అవే పార్టీల కు మ‌ద్ద‌తుగా మారిపోయార‌నే చ‌ర్చ ప్ర‌జ‌ల్లో లేదా ? లేద‌ని ప‌వ‌న్ అనుకుంటే.. దీనికి స‌మాధానం కూడా చెప్పాల్సిన అవ‌స‌రం లేద‌ని .. అనుకుంటే..ఆయ‌న జీవిత‌కాలం ఇలా ఉండాల్సిందే.

ఇక‌, మ‌రో కీల‌క విష‌యం.. ప‌వ‌న్‌ను ఎందుకు న‌మ్మాల‌నే ప్ర‌శ్న తెర‌మీదికి వ‌చ్చింది. గ‌తంలో 2014లో టీడీపీ స‌ర్కారుకు మ‌ద్ద‌తు ప‌లికిన ప‌వ‌న్‌.. అప్ప‌టి స‌మ‌స్య‌ల‌పై ప‌న్నెత్తు మాట కూడా మాట్లాడ‌కుండా.. వ్య‌వ‌హ‌రించారు. మ‌రి దీనిని ప్ర‌జ‌లు ఎందుకు విస్మ‌రించాల‌నేది ప్ర‌జ‌ల మాట‌. ఇవే వైసీపీకి ద‌న్నుగా మారుతున్నాయి. ప‌వ‌న్‌లో లేని స్థిత‌ప్ర‌జ్ఞ‌త‌.. వైసీపీకి సుస్థిర వ‌రంగా మారింద‌నేది .. ముమ్మాటికీ నిజం. ఇది ఎన్నాళ్లు ప‌వ‌న్ కొన‌సాగిస్తారో.. అప్ప‌టి వ‌ర‌కు వైసీపీ సేఫ్..!


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.