Begin typing your search above and press return to search.

ఆ మాజీ సీఎం అంత్య‌క్రియ‌ల ఖ‌ర్చు రూ.500

By:  Tupaki Desk   |   22 July 2019 10:55 AM GMT
ఆ మాజీ సీఎం అంత్య‌క్రియ‌ల ఖ‌ర్చు రూ.500
X
బతికున్నప్పుడు ప్రకృతిపై ప్రేమతోనే బతికారు.. ఇప్పుడు చనిపోయాక ఢిల్లీ మాజీ సీఎం షీలాదీక్షిత్ కోరిక ప్రకారమే ప్రకృతికి హాని కలుగకుండా పోయారు. షీలా కోరిక మేరకే ఇలా ఆమె దహన సంస్కారాలను చేశారు కుటుంబ సభ్యులు. ఇది దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారగా.. హిందూ వేదపండితులు మాత్రం ఇటువంటి అంత్రక్రియలను తీవ్రంగా ఖండించారు..

ఢిల్లీ సీఎం షీలా దీక్షిత్ గుండెపోటుతో మరణించారు. ఈ సందర్భంగా ఆమె అంత్యక్రియలను ఢిల్లీలోని నిగమ్ జోధ్ ఘాట్ లో జరిగాయి. అయితే ప్రకృతికి హాని తలపెట్టకుండా తన అంత్యక్రియలు నిర్వహించాలని ఆమె కుటుంబసభ్యులతో ముందే చెప్పారట.. దీంతో షీలాదీక్షిత్ కోరిక మేరకు నేచురల్ గ్యాస్ (సీఎన్జీ) ఉపయోగించి షీలా భౌతిక కాయాన్ని కాల్చారు. గ్యాస్ తో కాల్చడం వల్ల ఎటువంటి కాలుష్యం విడుదల అవ్వదు. పైగా ఖర్చు, సమయం తక్కువ.

మామూలుగా కట్టెలతో కాలిస్తే 1000 ఖర్చు అయ్యి కార్పన్ డై అక్సైడ్ విడుదలవుతుంది. పైగా శరీరం పూర్తిగా కాలడానికి 12 గంటలు పడుతుంది. అదే గ్యాస్ తో కాలిస్తే గంటలోనే శరీరం పూర్తిగా కాలిపోతుంది. పైగా కాలుష్యం లేకుండా. షీలా దీక్షిత్ కోరికను కుటుంబ సభ్యులు ఇలా తీర్చారు.

అయితే హిందూ సంఘాలు మాత్రం దీన్ని తీవ్రంగా వ్యతిరేకించాయి. హిందూ సంప్రదాయల ప్రకారం కట్టలపై కాల్చడం.. మట్టిలో పూడ్చడం చేయాలని.. ఇలా సీఎన్జీ విధానం సంప్రదాయాలకు వ్యతిరేకమని నినదించారు.