Begin typing your search above and press return to search.
ఇది షాకింగే.. వైసీపీలో ఏకంగా 8 జిల్లాల అధ్యక్షుల మార్పు!
By: Tupaki Desk | 24 Nov 2022 4:40 AM GMTఆంధ్రప్రదేశ్‌లో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మరోమారు విజయం సాధించాలని వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ కృతనిశ్చయంతో ఉన్నారు. 175కి 175 సీట్లు సాధించాలని పెద్ద లక్ష్యమే పెట్టుకున్నారు. ఈ మేరకు గతంలోనే 26 జిల్లాలకు పార్టీ అధ్యక్షులను, రీజనల్ కోఆర్డినేటర్లను, సోషల్ మీడియా, ప్రచార విభాగం, పబ్లిసిటీ విభాగం, పార్టీ అనుబంధ విభాగాలు ఇలా అన్నింటికీ అధ్యక్షులను కూడా నియమించారు.
మరోవైపు ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జులు గడప గడపకు మన ప్రభుత్వం పేరుతో ప్రజల వద్దకు వెళ్తున్నారు. ఈ మూడున్నరేళ్లలో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు, పథకాల గురించి ప్రజలకు వివరించి తమకు మళ్లీ ఓట్లేసి గెలిపించాలని అర్థిస్తున్నారు.
అయితే కొన్ని జిల్లాల్లో పార్టీ అధ్యక్షులు, రీజనల్ కోఆర్డినేటర్లు చురుగ్గా ఉండటం లేదని సమాచారం. అలాగే మరికొన్ని చోట్ల జిల్లా అధ్యక్ష పదవులు తమకొద్దని.. తమను తప్పించాలని కోరినట్టు వార్తలు వచ్చాయి.
కారణాలు ఏవైనా వైసీపీలో ప్రస్తుతం జిల్లా అధ్యక్షులుగా ఉన్నవారిలో ఏకంగా 8 మందికి ఉద్వాసన పలికారు. వీరి స్థానాల్లో కొత్తగా 8 మంది వచ్చారు. అదేవిధంగా కొంతమంది రీజనల్ కోఆర్డినేటర్లను కూడా సీఎం జగన్ తప్పించారు. వారి స్థానాల్లోనూ కొత్తవారిని నియమించారు.
ఇప్పుడీ మార్పులు వైసీపీ వర్గాల్లో కలకలం సృష్టించాయి. వైఎస్ జగన్ పదే పదే నేతలకు చెబుతున్నప్పటికీ కొన్ని జిల్లాల్లో వైసీపీ పరిస్థితి అస్సలు బాలేదని.. కొంతమంది నేతలు సరిగా పనిచేయడం లేదని ప్రశాంత్ కిశోర్ బృందం నివేదిక ఇచ్చినట్టు తెలుస్తోంది. అలాగే సీఎం జగన్ సైతం సొంతంగా సర్వేలు చేయించుకుంటున్నారని.. ఆ సర్వేల్లో కొన్ని జిల్లాల్లో పార్టీ పరిస్థితి తీసికట్టులా ఉందని తేలినట్టు సమాచారం.
దీంతో పార్టీ కార్యక్రమాలు ఎక్కడైతే చురుగ్గా సాగడం లేదో, ఎక్కడ నాయకులు క్రియాశీలకంగా లేరో అక్కడ పార్టీ అధ్యక్షులను, రీజనల్ కోఆర్డినేటర్లను తప్పిస్తూ జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
జిల్లా అధ్యక్షులుగా మార్చిన 8 మందిలో ముగ్గురు జిల్లా అధ్యక్షులు తాము చేయలేమని, తమ స్థానంలో కొత్తవారిని నియమించాలని కోరినట్లు తెలిసింది. మిగిలిన 5 జిల్లాల్లో పార్టీ అధిష్ఠానమే నిర్ణయం తీసుకుని మార్చేసిందంటున్నారు.
కుప్పం వైసీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా ఎమ్మెల్సీ భరత్ ఉన్న విషయం తెలిసిందే. ఆయన చిత్తూరు జిల్లా అధ్యక్షుడిగా ఇప్పటివరకు ఉండగా అతడిని తప్పించారు. ఆ బాధ్యతను ఉప ముఖ్యమంత్రి, సీఎం జగన్ వీర విధేయుడు నారాయణస్వామికి అప్పగించారు. అలాగే ఎమ్మెల్యేలు పుష్పశ్రీవాణి (పార్వతీపురం మన్యం), అవంతి శ్రీనివాస్ (విశాఖపట్నం), మేకతోటి సుచరిత (గుంటూరు), బుర్రా మధుసూదన్ యాదవ్ (ప్రకాశం), వై.బాలనాగిరెడ్డి (కర్నూలు), కాపు రామచంద్రారెడ్డి (అనంతపురం), చెవిరెడ్డి భాస్కరరెడ్డి (తిరుపతి)లను జిల్లా పార్టీ బాధ్యతల నుంచి తప్పించారు.
ఇక రీజనల్ కోఆర్డినేటర్లుగా వ్యవహరిస్తున్న మాజీ మంత్రులు కొడాలి నాని (గుంటూరు, పల్నాడు జిల్లాలు), అనిల్‌కుమార్ యాదవ్ (వైఎస్సార్, తిరుపతి జిల్లాలు)లనూ పార్టీ పదవుల నుంచి తొలగించారు. అలాగే ప్రాంతీయ సమన్వయకర్తలుగా వ్యవహరిస్తున్న వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి (కర్నూలు, నంద్యాల జిల్లాలు) లను కూడా ఆ బాధ్యతల నుంచి తప్పించారు.
సజ్జల, బుగ్గన రీజనల్ కోఆర్డినేటర్లుగా ఉన్న కర్నూలు, నంద్యాల జిల్లాల బాధ్యతను వైఎస్సార్ జిల్లా జడ్పీ ఛైర్మన్ ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డికి ఇచ్చారు. అనిల్ కుమార్ యాదవ్ వద్ద ఉన్న వైఎస్సార్, తిరుపతి జిల్లాలను బాపట్ల, ప్రకాశం జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్‌గా ఉన్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి అప్పగించారు.
బాలినేని శ్రీనివాసరెడ్డి వద్ద ఉన్న బాపట్ల జిల్లా సమన్వయ బాధ్యతను రాజ్యసభ ఎంపీ బీద మస్తాన్‌రావుకు ఇచ్చారు. కొడాలి నాని వద్దనున్న పల్నాడు జిల్లా బాధ్యతను తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డికి, గుంటూరు జిల్లా బాధ్యతను కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల ప్రాంతీయ సమన్వయకర్త మర్రి రాజశేఖర్‌కు అప్పగించారు. ఈ మూడు జిల్లాల ప్రాంతీయ సమన్వయకర్తగా మర్రి రాజశేఖర్‌తోపాటు ఎంపీ ఆళ్ల అయోధ్యరామిరెడ్డికి కొత్తగా బాధ్యతలిచ్చారు.
ఇక విజయనగరం జిల్లా బాధ్యతను మంత్రి బొత్స సత్యనారాయణ నుంచి టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి అప్పగించారు. వైవీ నుంచి అల్లూరి సీతారామరాజు జిల్లాను తప్పించి బొత్సకు కేటాయించారు.
ఇక చంద్రగిరి ఎమ్మెల్యే, ఇప్పటివరకు తిరుపతి జిల్లా అధ్యక్షుడిగా ఉన్న చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని పార్టీ పదవి నుంచి తప్పించి పార్టీ అనుబంధ విభాగాల కో ఆర్డినేటర్‌గా నియమించారు. పార్టీ రాష్ట్ర కో ఆర్డినేటర్, ప్రధాన కార్యదర్శి వి.విజయసాయిరెడ్డికి సహాయకారిగా చెవిరెడ్డి వ్యవహరిస్తారని వైసీపీ వర్గాలు తెలిపాయి.
జిల్లా అధ్యక్షుల కొత్త జాబితా
శ్రీకాకుళం – ధర్మాన కృష్ణదాస్
విజయనగరం – మజ్జి శ్రీనివాసరావు
పార్వతీపురం మన్యం – పరీక్షిత్ రాజు
అల్లూరి సీతారామరాజు – కోటగుళ్ల భాగ్యలక్ష్మి
విశాఖపట్నం – పంచకర్ల రమేష్
అనకాపల్లి – కరణం ధర్మశ్రీ
కాకినాడ – కురసాల కన్నబాబు
కోనసీమ – పొన్నాడ వెంకట సతీష్ కుమార్
తూర్పుగోదావరి – జక్కంపూడి రాజా
పశ్చిమగోదావరి – చెరకువాడ శ్రీరంగనాథ రాజు
ఏలూరు – ఆళ్ల నాని
కృష్ణా – పేర్ని నాని
ఎన్టీఆర్ – వెల్లంపల్లి శ్రీనివాసరావు
గుంటూరు – డొక్కా మాణిక్య వరప్రసాద్
బాపట్ల – మోపిదేవి వెంకటరమణ
పల్నాడు – పిన్నెల్లి రామకృష్ణారెడ్డి
ప్రకాశం – జంకె వెంకటరెడ్డి
నెల్లూరు – వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి
కర్నూలు – బీవై రామయ్య
నంద్యాల – కాటసాని రాంభూపాల్‌రెడ్డి
అనంతపురం – పైలా నరసింహయ్య
శ్రీసత్యసాయి జిల్లా – మాలగుండ్ల శంకరనారాయణ
వైఎస్సార్ కడప – కొట్టమద్ది సురేష్‌బాబు
అన్నమయ్య – గడికోట శ్రీకాంత్‌రెడ్డి
చిత్తూరు – కె నారాయణస్వామి
తిరుపతి – నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.