Begin typing your search above and press return to search.
సీఎం సారూ.. ఒక్కసారి ఆలోచించండన్న సీతక్క?
By: Tupaki Desk | 18 Oct 2020 10:50 AM GMTప్రతీ వీకెండ్ కానీ.. లేదంటే ఏదైనా పండుగొచ్చినా పబ్బమొచ్చినా.. సీఎం కేసీఆర్ తన వ్యవసాయ క్షేత్రానికి వెళుతుంటారు. ప్రగతి భవన్ టు గజ్వేల్ లోని ఫామ్ హౌస్ కు కేసీఆర్ రాకపోకలు సాగిస్తుంటారు..
అయితే సీఎం కేసీఆర్ రాకపోకల వల్ల ట్రాఫిక్ భారీగా జామ్ అవుతోందని.. వాహనాలు ట్రాఫిక్ లో నిలిపివేస్తున్నారని తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క ట్విట్టర్ లో ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ భారీ కాన్వాయ్ తో ప్రయాణిస్తుంటారని.. దీని వల్ల అది వెళ్లే వరకు వాహనాలను పోలీసులు నిలిపివేస్తున్నారని అన్నారు.
భారీ వర్షాలు పడుతున్న ఈ సమయంలోనూ ట్రాఫిక్ నిలిపివేసి సీఎం కేసీఆర్ ఫాంహౌస్ కు వెళుతున్న వీడియోను కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.
ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కు ఓ విజ్ఞాపన చేశారు. ‘అయ్యా ముఖ్యమంత్రి గారు మీకు ఇదే నా విన్నపం.. మీ 300 ఎకరాల ఫామ్ హౌస్ నుంచి సీఎం క్యాప్ ఆఫీసుకు రాకపోకలు సాగించకండి. మీ ప్రయాణాల వల్ల ఈ భారీ వర్షాల్లో 60 కి.మీ మేర ట్రాఫిక్ జామ్ అవుతోంది. పాపం వాళ్లు కూడా జాగ్రత్తగా ఇళ్లకు చేరాలి కదా.. ఓ సారి ఆలోచించండి’ అంటూ సీతక్క ట్వీట్ చేశారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

CM Kcr Garu it’s my request, don’t do up and down trips from 300 acers farm house to CM champ office you are creating traffic in this heavy rains for 60 kilometres, even they need to go home safe think once sir