Begin typing your search above and press return to search.

మ‌ద్యం తాగితే క‌రోనా సోక‌దా?.. నిపుణుల ఆన్స‌ర్ ఇదే!

By:  Tupaki Desk   |   7 May 2021 1:30 AM GMT
మ‌ద్యం తాగితే క‌రోనా సోక‌దా?.. నిపుణుల ఆన్స‌ర్ ఇదే!
X
భ‌యాన్ని క్యాష్ చేసుకోవ‌డం ఈ స‌మాజానికి అల‌వాటు. అన్ని స‌మయాల్లోనూ, అన్ని విష‌యాల్లోనూ ఇది కొన‌సాగుతుంది. ఇప్పుడు క‌రోనా నేప‌థ్యంలో మ‌రీ ఎక్కువైంది. హెల్త్ గురించి ఏ మాత్రం అవ‌గాహ‌న లేనివారు, దానికి సంబంధించిన చ‌దువులే చ‌ద‌వ‌ని వారు కూడా డాక్ట‌ర్లుగా అవ‌తారం ఎత్తుతున్నారు. నిపుణులుగా మారిపోయి స‌ల‌హాలు, సూచ‌న‌లు ఇచ్చేస్తున్నారు.

అలాంటి స‌ల‌హాల్లో ఒక‌టి మ‌ద్యం తీసుకోవాలా? వ‌ద్దా? అనేది. క‌రోనా ఆల్క‌హాల్ కాబ‌ట్టి.. అది ఘాటుగా ఉంటుంది కాబ‌ట్టి.. అది తాగితే శ‌రీరంలోనికి వెళ్లి వైర‌స్ ను చంపుతుంద‌ట‌. ఇదీ.. సోష‌ల్ మీడియాతోపాటు మ‌నుషుల మ‌ధ్య స‌ర్క్యులేట్ అవుతున్న విష‌యం.

దీనిపై తాజాగా పంజాబ్ ఎక్స్ ప‌ర్ట్ క‌మిటీ హెడ్ డాక్ట‌ర్ త‌ల్వార్ స్పందించారు. మ‌ద్యం తాగితో క‌రోనా రాద‌నే ప్ర‌చారంలో ఏ మాత్రం నిజం లేద‌ని చెప్పారు. ఈ అస‌త్య ప్ర‌చారాన్ని ప్ర‌జ‌లు న‌మ్మొద్ద‌ని కోరారు. అంతేకాదు.. అతిగా మ‌ద్యం తాగ‌డం వ‌ల్ల రోగ‌నిరోధ‌క శ‌క్తి కూడా త‌గ్గిపోతుంద‌ని చెప్పారు. కొవిడ్ వ్యాపిస్తే.. ప్రాణాంత‌కంగా మార‌డానికి మ‌ద్యం కార‌ణమ‌వుతుంద‌ని కూడా చెప్పారు. అయితే.. ప‌రిమితంగా మ‌ద్యం తీసుకుంటే న‌ష్టం లేద‌ని చెప్పారు.

అదేవిధంగా.. వ్యాక్సిన్ తీసుకునేవారు దానికి ముందు మూడ్నాలుగు రోజులు.. తీసుకున్న త‌ర్వాత మ‌రో వారం పాటు మ‌ద్యం తీసుకోక‌పోవడం మంచిద‌ని సూచించారు. దీనివ‌ల్ల యాంటీబాడీలు వేగంగా అభివృద్ధి చెందుతాయ‌ని పేర్కొన్నారు.