Begin typing your search above and press return to search.

గర్ల్ ఫ్రెండ్ ను కలవాలన్న నెటిజన్లకు పోలీసుల సమాధానం ఇదీ

By:  Tupaki Desk   |   22 April 2021 3:55 PM GMT
గర్ల్ ఫ్రెండ్ ను కలవాలన్న నెటిజన్లకు పోలీసుల సమాధానం ఇదీ
X
మహారాష్ట్రలో కరోనా కల్లోలం చోటుచేసుకుంది. అక్కడి ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధిస్తోంది. వాహనాల రాకపోకలను రాత్రి పూట కట్టడి చేస్తోంది. ముంబై పోలీసులు కలర్ కోడెడ్ స్టిక్కర్ల వ్యవస్థను కూడా ప్రవేశపెట్టారు. అత్యవసర సేవల సిబ్బంది ప్రయాణానికి ఆటంకం కలుగకుండా ఎరుపు, ఆకుపచ్చ, పసుపుపచ్చ స్టిక్కర్లను పంపిణీ చేశారు.

ఈ స్టిక్కర్ల వద్ద టోల్ ప్లాజాలు, చెక్ పాయింట్ల వద్ద వారిని ఆపకుండా పంపించి వేస్తున్నారు. టోల్ ప్లాజాల వద్ద వీటిని ఉంచారు. అయితే వీటిని దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.

దీనిపై ఓ నెటిజన్ ట్విట్టర్ వేదికగా ముంబై పోలీసులకు ఓ తుంటరి ప్రశ్న వేశారు. కరోనా లాక్ డౌన్ తో నేను చిక్కుకుపోయా.. నా గర్ల్ ఫ్రెండ్ ను కలవడానికి వెళదామనుకుంటున్నా.. మరి వెహికిల్ కు ఏ స్టిక్కర్ వాడాలి? ఆమెను చాలా మిస్ అవుతున్నా? ' అంటూ పోలీసులను ప్రశ్నించాడు.

దీనికి ముంబై పోలీసులు సీరియస్ కాకుండా హుందా జవాబిచ్చారు. 'గర్ల్ ఫ్రెండ్ ను కలవడం మీకు ఎంతో ముఖ్యమని అర్థం చేసుకున్నాం.. కానీ ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇది అత్యవసరమేమీ కాదు.. దూరం పెరిగేకొద్దీ మనుసులు దగ్గరవుతాయి.. ఆరోగ్యం ఇప్పుడు ముఖ్యం.. జీవితాంతం కలిసుండాలంటే ఎడబాటు తప్పదు.. ఇది జీవితంలోనే కీలక దశ' అంటూ ట్వీట్ చేశారు.పోలీసుల ట్వీట్ పై నెటిజన్లు ప్రశంసలు కురిపించారు. వేల కొద్దీ లైకులు, రీట్వీట్ లు వచ్చిపడుతున్నాయి.