Begin typing your search above and press return to search.
రాయలసీమ ప్రాజెక్ట్ పై ఏపీ వాదన ఇదే
By: Tupaki Desk | 4 Jan 2021 1:23 PM GMTసీమ కష్టాలు తీర్చేందుకు ఏపీ సీఎం జగన్ ప్రతిపాదించిన ‘రాయలసీమ ఎత్తిపోతల పథకం’కు అనుకోని అవాంతరాలు ఎదురయ్యాయి. కృష్ణా నదిపై చేపట్టిన ఈ ప్రాజెక్టును ఎగువన ఉన్న తెలంగాణ అభ్యంతరం తెలిపింది. సుప్రీంకోర్టుకు ఎక్కింది.కృష్ణా బోర్డుకు కూడా ఫిర్యాదులు అందాయి.
ఈ క్రమంలోనే ఏపీ ప్రభుత్వం ఈ సీమ ఎత్తిపోతల పథకంపై కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు సంచలన వివరణ పంపింది. రాయలసీమ ఎత్తిపోతల పథకం కొత్త ప్రాజెక్ట్ కాదని.. అందుకే తాము డీపీఆర్ ఇవ్వలేదని కృష్ణా నది బోర్డుకు ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది.
తాజాగా రాష్ట్ర జలవనరుల శాఖ చీఫ్ ఇంజినీర్ నారాయణ రెడ్డి, ఏపీ కేటాయింపులకు లోబడే ప్రాజెక్ట్ రీడిజైన్ చేస్తున్నామని చెప్పారు. ప్రాజెక్టును కొనసాగించేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు.
జాతీయ ప్రాధాన్యం కోసమే.. కృష్ణా బోర్డు హెడ్ ఆఫీసును విశాఖలో పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. దీనిపై కృష్ణా బోర్డు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తిగా మారింది.