Begin typing your search above and press return to search.
అమరావతి లో బాబు చేసిన బిగ్ మిస్టేక్ ఇదే
By: Tupaki Desk | 27 Dec 2019 5:51 AM GMTతెలంగాణ నీటి గోస తీరుస్తానని గెలిచిన కేసీఆర్ అన్నింటిని పక్కనపెట్టి కాళేశ్వరం కట్టాడు. ఇప్పుడు నీటిని అందించాడు. అదే ఏపీ సీఎం మాత్రం రాజధాని లేని రాష్ట్రానికి సింగపూర్ లాంటి అమరావతి నగరాన్ని కడుతానన్నాడు.. జాప్యం చేశాడు. అదే చంద్రబాబు కొంప ముంచిందన్న వాదన బలంగా వినిపిస్తోంది.
కాలం చాలా విలువైందని.. ఐదేళ్లు మాత్రమే చంద్రబాబు కు పరిపాలించమని ప్రజలు ఓటేశారు. ఆ ఐదేళ్ల లోనే నిరూపించుకోవాలి.. హామీనిచ్చిన అమరావతిని కట్టేయాలి.. కానీ ఐదేళ్లుగా ఏ పనిచేయకుండా అమరావతి అంటూ గ్రాఫిక్స్ మాయాజాలం చేసి మొండిగోడలను విదిల్చిన చంద్రబాబుకు ఇప్పుడు తగిన శాస్తి జరిగిందని టీడీపీ నేతలే వ్యాఖ్యానిస్తున్న పరిస్థితి.
ఈ ఐదేళ్లలో అంతా తాత్కాలికం పేరిట వెలగపూడి లో తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు, తాత్కాలిక కార్యాలయాలను అంతా కట్టేసి అసలైన రాజధాని ని కట్టకుండా బాబు చేసిన పొరపాటే ఇప్పుడు ఆయన పుట్టి ముంచిందన్న వాదన వినిపిస్తోంది.
పక్కనున్న కేసీఆర్ ఓ పద్ధతి ప్రకారం స్పీడ్ గా కాళేశ్వరం కట్టేశాడు. చంద్రబాబు కూడా ఆ తాత్కాలిక నిర్మాణాలకు డబ్బులు తగిలేయకుండా వేగంగా పక్కా శాశ్వత భవనాలు కట్టేసి ఒప్పందాలు కుదుర్చుకున్న కంపెనీలన్నీ అమరావతిలో పనులు ప్రారంభించి ఉంటే ఇప్పుడు జగన్ అమరావతి రాజధానిని మార్చే సాహసానికి పోయేవాడు కాదు.. రాజధానిలో భూములు కొన్న టీడీపీ నేతలు లబోదిబోమనే వారే కాదు.. చంద్రబాబు చేసిన తాత్కాలిక నిర్లక్ష్యమే ఇప్పుడు టీడీపీ నేతలను, చంద్రబాబు ను ముంచిదన్న వాదన వినిపిస్తోంది.