Begin typing your search above and press return to search.

ఈ ప్రేమ జంట కథలో ఇదే పెద్ద ట్విస్ట్

By:  Tupaki Desk   |   7 Jun 2019 8:00 AM GMT
ఈ ప్రేమ జంట కథలో ఇదే పెద్ద ట్విస్ట్
X
వాళ్లిద్దరిదీ 8వ తరగతి నుంచి ప్రేమ.. చూడడానికి ఇద్దరూ హీరో హీరోయిన్లులాగా ఉంటారు.. ఇంటర్ వచ్చేసరికి ఆ ప్రేమ ముదిరి పాకాన పడింది. ఆ తర్వాత ఒకరిని విడిచి ఒకరు ఉండలేకపోయారు. వీరి ప్రేమను శరామామూలుగానే పెద్దలు నో చెప్పారు. దళిత యువకుడిని పెళ్లి చేసుకుంటావా అని అడ్డు చెప్పారు. దీంతో ఇద్దరు ఇంట్లోంచి పారిపోయి పెళ్లి చేసుకున్నారు. కానీ ఇక్కడే ట్విస్ట్ నెలకొంది. వీరి పెళ్లికి పోలీసులు నో చెప్పారు. ఆ ప్రేమ జంటను విడదీశారు. ఇది వివాదాస్పదమైంది. ఈ కథలో అసలు ట్విస్ట్ ఏంటంటే ..

తిరుపతికి చెందిన మనీషా.. బంగారుపాలానికి చెందిన ఉమామహేష్ లు ప్రేమించుకున్నారు. ఇద్దరి మధ్య 8వ తరగతి నుంచే స్నేహం ప్రేమగా మారింది. దళిత యువకుడు కావడంతో ఇంట్లో వాళ్లు పెళ్లికి ఒప్పుకోలేదు. అమ్మాయి ఫైనాన్స్ వ్యాపారి వికాస్ చౌదరి కూతురు మనీషా.. కూతురును దూరంగా ఉండాలని బెదిరించాడు. కానీ మనీషాకు 18 ఏళ్లు నిండగానే ప్రియుడు ఉమామహేశ్వర్ తో కలిసి పారిపోయి పెళ్లి చేసుకుంది.

పెళ్లి చేసుకున్నాక తమకు రక్షణ కల్పించాలని తిరుపతి అర్బన్ పోలీసులను ప్రేమ జంట కలిసింది. కానీ ఒక్కటి చేయాల్సిన పోలీసులు వీరిని విడదీయడం గమనార్హం. ఇది పెద్ద దుమారం రేపింది. దీనికి కారణంగా ప్రియుడు మేజర్ కాకపోవడమేనని పోలీసులు తెలిపారు. చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ కింద ఇరు కుటుంబాలపై కేసు పెట్టిన పోలీసులు.. అమ్మాయిని మహిళా సంక్షేమ వసతి గృహానికి.. అబ్బాయిని వాళ్ల ఇంటికి పంపారు.

మనీషా వయసు 18 ఏళ్లు నిండింది. ఆమే మేజర్. కానీ ప్రియుడు ఉమామహేశ్వర్ రావు వయసు 20 ఏళ్లే. పెళ్లి చేసుకోవాలంటే ఇంకో ఏడాది 21 ఏళ్ల వరకు ఆగాల్సిందే. ఈ విషయంలో కేసు నమోదు చేసిన పోలీసులు ఇళ్లకు పంపించారు. మైనర్ అయిన ఉమా మహేశ్వరరావు పెళ్లిని పోలీసులు నో చెప్పారు.