Begin typing your search above and press return to search.

ఈ జూనియర్ మంత్రి పై సీనియర్ ఎమ్మెల్యేల దెబ్బ

By:  Tupaki Desk   |   14 Nov 2019 1:30 AM GMT
ఈ జూనియర్ మంత్రి పై సీనియర్ ఎమ్మెల్యేల దెబ్బ
X
ఆయనో జూనియర్ మంత్రి.. 2014లో తొలిసారి ఎమ్మెల్యే గా లక్కీ గా గెలిచాడు. నిజామాబాద్ ఎంపీ కవిత సపోర్టు తో పెద్ద సారు కేసీఆర్ వద్ద శిష్యుడి గా చేరాడు. గూరూజీ కేసీఆర్ ఆదేశాల మేరకు గత నాలుగేళ్లు అన్నీ పనులు చక్క బెట్టారు. రెండోసారి 2019లో కూడా గెలవడం తో లక్కీ గా మంత్రి అయిపోయారు. నిజామాబాద్ జిల్లా కు చెందిన పోచారం స్పీకర్ గా అయిపోవడం తో ఆయన స్థానంలో బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి అతి చిన్న వయసు లో మంత్రి అయ్యారు. అయితే ఇక్కడే వచ్చింది సమస్య.

బాల్కొండ నుంచి రెండో సారి గెలిచిన ప్రశాంత్ రెడ్డి ని ఇప్పుడు మంత్రి గా నిజామాబాద్ జిల్లాలో ఎవరూ గుర్తించడం లేదని ప్రచారం సాగుతోంది. 2014 లో ఆయన తో పాటు జిల్లాలోని 9 నియోజకవర్గాల్లో 8 మంది గెలిచారు. ఇంకొకతను కూడా పార్టీ మారీ టీఆర్ఎస్ లో చేరారు. ప్రశాంత్ రెడ్డి కంటే కూడా రాజకీయాల్లో సీనియర్ ఎమ్మెల్యేలు.. పలు సార్లు గెలిచిన వారు ఉన్నారు. దీంతో తమ కంటే జూనియర్ కు మంత్రి పదవి రావడం పై వారంతా గుస్సాగా ఉన్నారట.. అందుకే తమ నియోజకవర్గాల్లో మంత్రి ప్రశాంత్ రెడ్డిని కాలు కూడా పెట్టనివ్వడం లేదట..

దీంతో నిజామాబాద్ పాత జిల్లాకు మంత్రి అయిన ప్రశాంత్ రెడ్డి ఇప్పుడు కేవలం తన బాల్కొండ నియోజక వర్గానికి మాత్రమే పరిమితమై పోతున్నాడట.. నిజామాబాద్ జిల్లా కేంద్రానికి గానీ, అభివృద్ధి పనుల కు కూడా హాజరు కావడం లేదు. ఉమ్మడి జిల్లా కార్యక్రమాల కు దూరం గా ఉండి పోతున్నారు. తన మిత్రులైన కామా రెడ్డి ఎమ్మెల్యే నియోజకవర్గం లో మాత్రమే పర్యటిస్తున్నారు.

ఇలా ఒక పెద్ద జిల్లా నుంచి మంత్రి అయ్యానన్న సంబరం ఇప్పుడు మంత్రి ప్రశాంత్ రెడ్డి లో లేకుండా పోయిందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. సీనియర్ ఎమ్మెల్యే ల ముందు ఈ జూనియర్ మంత్రి ఆటలు సాగడం లేదట.. దీంతో కక్కలేక మింగ లేక మంత్రి గా అలా మమ అనిపిస్తున్నాడట..