Begin typing your search above and press return to search.

తెలుగు రాష్ట్రాల సీఎంలకు కేఏ పాల్ ఇచ్చిన బంఫ‌ర్ ఆఫ‌ర్ ఇదే!

By:  Tupaki Desk   |   14 July 2022 1:30 PM GMT
తెలుగు రాష్ట్రాల సీఎంలకు కేఏ పాల్ ఇచ్చిన బంఫ‌ర్ ఆఫ‌ర్ ఇదే!
X
కేఏ పాల్‌ని రాజకీయ నేతగా చూసేవారి కంటే కమెడియన్‌గా చూసేవారే ఎక్కువ అని అంటుంటారు. ఆయన మాటలు, చేష్టలు, హావభావాలు, ఆయన చెప్పుకునే గొప్పలు మంచి విదూషకుడిని తలపిస్తాయని చెప్పుకుంటుంటారు. సీరియస్‌ పాలిటిక్స్, బూతులు, తిట్లతో అలసిపోయినవారికి తన మాటలతో కేఏ పాల్‌ మంచి వినోదం పంచుతుంటార‌ని అనుకుంటుంటారు. తన పార్టీ తరఫున ఒక్క వార్డు మెంబర్‌ లేకపోయినా దేశానికి కాబోయే ప్రధానిమంత్రిని తానేనని కేఏ పాల్ చెబుతుంటారు.

తాజాగా ఈ నేప‌థ్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులకు ప్ర‌జా శాంతి పార్టీ అధ్య‌క్షుడు కేఏ పాల్‌ బంపర్‌ ఆఫర్‌ ఇచ్చారు. కేసీఆర్‌, జగన్‌ తనతో కలిసొస్తే విభజన హామీలను సాధిస్తానంటూ వ్యాఖ్యానించారు.

ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ విభ‌జ‌న సంద‌ర్భంగా ఏపీ, తెలంగాణకు ఇచ్చిన విభజన హామీల సాధన కోసం జూలై 16న ఢిల్లీలో మౌనదీక్ష చేపట్టబోతున్నట్లు కేఏ పాల్ ప్రకటించారు. రాజ్‌ఘాట్‌ వేదికగా తాను చేయబోయే ఆందోళనలో కలిసి రావాలని వైఎస్ జ‌గ‌న్, కేసీఆర్ ల‌కు పిలుపునిచ్చారు. వారిద్ద‌రూ వ‌స్తానంటే ప్ర‌త్యేక విమానంలో వారిని ఢిల్లీకి తీసుకెళ్తానంటూ మ‌రో బంఫ‌ర్ ఇచ్చారు. ఒక్క మూడు గంట‌ల‌పాటు త‌న‌తో క‌లిసి మౌన‌దీక్ష చేప‌ట్టాల‌ని కేసీఆర్, జ‌గ‌న్ ను కోరారు.

పవన్‌ కల్యాణ్‌, షర్మిల, ప్రవీణ్‌ కుమార్‌ సహా అన్ని పార్టీల వారు తనతో కలిసి దీక్షకు రావాలని పిలుపునిచ్చారు. ఢిల్లీలో తాను చేస్తున్న దీక్ష కోసం అవసరమైతే సీఎంలకు ప్రత్యేక విమానాలు పంపిస్తానన్నారు. కేంద్రం ఏపీకి ప్రత్యేక హోదా, తెలంగాణకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

గతంలో చంద్రబాబు, ఇప్పుడు జగన్‌ సీబీఐ కేసులకు భయపడి రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీపడ్డార‌ని కేఏ పాల్ ఆరోపించారు. టీఆర్ఎస్.. బీజేపీకి బీ టీమ్ అని సంచ‌లన ఆరోప‌ణ‌లు చేశారు. త‌న‌ను తెలంగాణకు సీఎంని చేస్తే రూ.వేల కోట్ల పెట్టుబడులు తెస్తాన‌ని కేఏ పాల్ తెలిపారు. జగన్‌ రూ.8 లక్షల కోట్లు అప్పులు చేశార‌ని మండిప‌డ్డారు. ఏపీకి కంపెనీలు తీసుకురాలేక పోయార‌ని కేఏ పాల్ ధ్వ‌జ‌మెత్తారు.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప్ర‌జా శాంతి పార్టీని గెలిపించాల‌ని ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చారు. ప్ర‌జా శాంతి పార్టీని గెలిపిస్తే తాను ప్ర‌ధాన‌మంత్రిని అవుతాన‌ని చెప్పారు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా తెలుగువారంద‌రికీ మంచి పేరు
తెస్తాన‌న్నారు.