Begin typing your search above and press return to search.
అదరగొట్టిన మార్కెట్..10 ఏళ్లలో ఇదే మొదటిసారి !
By: Tupaki Desk | 1 May 2020 7:00 AM GMTదేశీయ స్టాక్ మార్కెట్ కు ఈ రోజు (శుక్రవారం) సెలవు. మహారాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం, సందర్భంగా బీఎస్ ఈ సెన్సెక్స్, ఎన్ ఎస్ ఈ నిఫ్టీ ట్రేడింగ్ వుండదు. శనివారం, ఆదివారం సాధారణ సెలవు రోజులు. ఈ నేపథ్యంలో స్టాక్ మార్కెట్ మార్కెట్ సోమవారం మళ్లీ తిరిగి ప్రారంభమవుతుంది. అలాగే నేడు మే 1 అంతర్జాతీయ కార్మికదినోత్సవం. పారిశ్రామిక రంగానికి మరో ప్యాకేజీని కేంద్రం ఇవ్వబోతుందన్న అంచనాలు - లాక్ డౌన్ ఎత్తివేత - ఆర్థిక కార్యకలాపాలు తిరిగి ప్రారంభం కానున్నాయన్న అంచనాలకు తోడు గ్లోబల్ మార్కెట్ల సానుకూల సంకేతాల నేపథ్యంలో మార్కెట్ వరుసగా నాలుగవ రోజు సానుకూలంగా ముగిసింది.
కరోనా చికిత్సలో గిలియడ్ రెమెడిసివిర్ ఔషధం సత్ఫలితాలు ఇస్తోందన్న అమెరికా ప్రకటన, వ్యాక్సిన్ పై మానవ పరీక్షలను ప్రారంభించడం కూడా ర్యాలీకి ఆజ్యం పోసింది. దీంతో గురువారం కీలక సూచీలు భారీగా లాభపడ్డాయి. దీనికితోడు ఏప్రిల్ డెరివేటివ్స్ కాంట్రాక్టుల ముగింపు రోజు కావడంతో షార్ట్ కవరిం, రోల్-ఓవర్లు కూడా లాభాలకు దోహదపడ్డాయి. సెన్సెక్స్ 997 పాయింట్ల లాభంతో 33,718 పాయింట్ల వద్ద, నిఫ్టీ 307 పాయింట్లు ఎగసి 9,860 పాయింట్ల వద్ద ముగిశాయి. అటు డాలర్ తో రూపాయి మారకం విలువ మరో 57 పైసలు పుంజుకోవడం గమనార్హం.
కాగా గత తొమ్మిదేళ్లలో ఈ రెండు సూచీలకు ఇది రెండో అత్యధిక వారం లాభం. ఏప్రిల్ నెలలో సెన్సెక్స్ 13 శాతం, నిఫ్టీ 14 శాతానికి పైగా లాభపడ్డాయి. ఈ వారంలో సెన్సెక్స్ 7.6 శాతం, నిఫ్టీ 7.7 శాతం చొప్పున ఎగిశాయి. ఒక నెలలో సెన్సెక్స్ 4 వేల పాయింట్లకు పైగా ఎగిసింది. గత 10 ఏళ్లలో ఇంతగా లాభపడటం ఇదే మొదటిసారని మార్కెట్ వర్గాలు వెల్లడించాయి. అలాగే ఒక నెలలో నిఫ్టీ ఇంతగా లాభపడటం గత 11 ఏళ్లలో ఇదే మొదటిసారి. అయితే , ఇదే సమయంలో ఈ స్థాయిల వద్ద కరెక్షన్ కు అవకాశం వుందని, పెట్టుబడి దారులు అప్రమత్తంగా వుండాలని వినోద్ నాయర్, జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ సూచించారు.