Begin typing your search above and press return to search.

ఇలాంటి కొడుకు.. ఎవ‌రికైనా పుడితే.. ఏం జ‌రిగిందో చ‌ద‌వండి

By:  Tupaki Desk   |   25 July 2022 11:24 AM GMT
ఇలాంటి కొడుకు.. ఎవ‌రికైనా పుడితే.. ఏం జ‌రిగిందో చ‌ద‌వండి
X
త‌ల్లిదండ్రుల మీద ద‌య‌లేని పుత్రులు.. కోకొల్ల‌లుగా పెరుగుతున్న నేటి కాలంలో... ప‌ట్టుమ‌ని మూడు ప‌దులు కూడా నిండ‌ని..యువ‌కుడు..త‌న త‌ల్లిదండ్రుల ప‌ట్ల అపార‌మైన ప్రేమ‌ను కురిపిస్తున్నాడు. హరి ద్వార్లో పవిత్ర గంగా స్నానం ఆచరించి, కావడి యాత్ర పూర్తి చేయాలన్న ఆ వృద్ధ త‌ల్లిదండ్రుల కలను సాకారం చేస్తున్నాడు. కలియుగ శ్రవణ కుమారుడిలా మారిన ఆ యువ‌కుడు.. త‌ల్లిదండ్రులు ఇద్ద‌రినీ కావడిలో కూర్చోబెట్టి, భుజాలపై మోస్తూ.. వారి కల సాకారం చేశాడు.

భుజంపై కావడి.. అందులో ఓవైపు అమ్మ, మరోవైపు నాన్న.. శక్తినంతా కూడదీసుకుంటూ భారంగా అడుగు లు.. ఎండైనా, వానైనా ఆగకుండా సాగే పయనం.. ఇలా ఒకటి, రెండు కాదు.. ఏకంగా వందల కిలోమీటర్లు ప్రయాణిస్తున్నాడు 'కలియుగ శ్రవణుడు' వికాస్ గహ్లోత్. జీవిత చరమాంకంలో కావడి యాత్ర చేయాల న్న తల్లిదండ్రుల ఆకాంక్షను నెరవేర్చుతున్నాడు.

24 ఏళ్ల వికాస్ గహ్లోత్.. ఉత్తర్ప్రదేశ్లోని గాజియాబాద్ వాసి. వృద్ధాప్యంలో ఉన్న అతడి తల్లిదండ్రులు.. కావడి యాత్ర చేయాలని ఉందని చెప్పారు. కావడి యాత్ర అంటే అంత సులువైనదేమీ కాదు. శారీరకంగా శ్రమతో కూడుకున్నది. ఈ యాత్ర కోసం.. వేర్వేరు ప్రాంతాల్లోని శివ భక్తులు.. ఉత్తరాఖండ్లోని హరిద్వార్, గౌముఖ్, గంగోత్రి, బిహార్లోని సుల్తాన్గంజ్ వంటి చోట్లకు వెళ్లి గంగా నదిలో పుణ్యస్నానాలు చేస్తారు.

అనంతరం అక్కడ గంగాజలం సేకరించి, బిందెల్లో నింపి, కావడిపై మోసుకుంటూ స్వస్థలాలకు చేరతా రు. వారి సొంత ఊళ్లలోని శివాలయాల్లో ఆ గంగా జలాన్ని సమర్పిస్తారు. కావడి యాత్ర ఇంత కష్టమైనా.. అమ్మానాన్నల కోర్కెను వికాస్ కాదనలేకపోయాడు. తానే అభినవ శ్రవణ కుమారుడి అవతారం ఎత్తాడు. ఇద్దరితో కలిసి గాజియాబాద్ నుంచి హరిద్వార్ వెళ్లి గంగా స్నానం ఆచరించాడు. పవిత్ర జలం సేకరించి దాదాపు 200 కిలోమీటర్ల దూరంలోని గాజియాబాద్కు కావడి యాత్ర ప్రారంభించాడు.

ఇందుకోసం లోహంతో ఓ బలమైన కావడి చేయించాడు. ఓవైపు అమ్మను, మరోవైపు నాన్నను కూర్చో బెట్టాడు. 20 లీటర్ల గంగా జలం నింపిన డబ్బాను నాన్న దగ్గరే పెట్టాడు. ఎండ, వానలో తమను భుజాలపై మోస్తూ కొడుకు పడుతున్న కష్టాన్ని చూడకుండా ఉండేందుకు అమ్మానాన్నల కళ్లకు గంతలు కట్టాడు వికాస్. అతడికి అండగా ఉండేందుకు ఇద్దరు స్నేహితులూ తోడయ్యారు. జులై 17న ప్రారంభమైన ఈ అభినవ శ్రవణుడి యాత్ర.. అతడి ఉక్కు సంకల్పంతో, తల్లిదండ్రులపై ప్రేమతో నిరాటంకంగా ముందుకు సాగుతోంది.

కొస‌మెరుపు..

ఇప్పుడు చెప్పండి.. మీ అబ్బాయిలోనూ ఈ ల‌క్ష‌ణం(త‌ల్లిదండ్రుల ప‌ట్ల ద‌య చూపించి.. ఎన్ని క‌ష్ట‌న‌ష్టాలు ఎదురైనా.. వారి కోరిక నెర‌వేర్చే ల‌క్ష‌ణం) ఉందా?!