Begin typing your search above and press return to search.
జొమాటో వివాదం పోలీసుల లేటెస్ట్ అప్డేట్ ఇదే!
By: Tupaki Desk | 23 March 2021 4:30 PM GMTజొమాటో ఫుడ్ డెలివరీ బాయ్ తనపై దాడిచేశాడంటూ ఓ యువతి పోస్టు చేసిన వీడియో సంచలనం రేకెత్తించిన విషయం తెలిసిందే. ఫుడ్ డెలివరీ చేయడానికి వచ్చిన సదరు వ్యక్తి.. తనతో దురుసుగా ప్రవర్తించాడని, ఇంట్లోకి వచ్చి తనను దారుణంగా కొట్టాడని, అందుకే ముక్కు పగిలిందంటూ రక్తం కారుతున్న ఫేస్ తో ఆమె వీడియో చేయడం.. పోలీసులు అతన్ని అరెస్టు చేయడం కూడా జరిగింది. ఆ తర్వాత బెయిల్ పై విడుదలైన డెలివరీ బాయ్ కామరాజ్.. సదరు యువతి హితేషపై కేసు పెట్టాడు.
అయితే.. అప్పటి నుంచి ఆమెను విచారించేందుకు పోలీసులు ప్రయత్నిస్తుండగా.. అందుబాటులోకి రావట్లేదు. హితేషను విచారణకు రావాలని ఆదేశించగా. తాను మహారాష్ట్ర వెళ్తున్నట్టు చెప్పిందన్నారు పోలీసులు. ఆమెకు ఆరోగ్య సమస్యలున్నాయని, ఆసుపత్రిలో చికిత్స పొందుతోందని బంధువులు చెప్పారు. అయితే.. ఫోన్ నెట్వర్క్ లొకేషన్ ఆధారంగా ట్రేస్ చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
ఈ కేసులో సాక్ష్యం లేకపోవడంతో ప్రధాన సమస్యగా మారిందని పోలీసులు తెలిపారు. సీసీ టీవీ లేకపోవడంతో ఏం జరిగిందో అర్థం కావట్లేదని అన్నారు. మరోవైపు హితేష విచారణకు హాజరు కాకపోవడం కూడా ఇబ్బందిగా మారిందన్నారు. అందువల్ల ఈ కేసు విచారణ తాత్కాలికంగా పక్కన పెడుతున్నట్లు తెలిపారు.