Begin typing your search above and press return to search.
కరోనా సోకి తగ్గిన తర్వాత పిల్లల్లో వచ్చే ప్రధాన సమస్య ఇదే .. !
By: Tupaki Desk | 8 May 2021 8:30 AM GMTకరోనా మహమ్మారి దేశంలో అల్లకల్లోలం సృష్టిస్తుంది. ముఖ్యంగా ఈ సెకండ్ వేవ్ లో పెద్దవారితో పాటుగా చిన్నపిల్లలు కూడా మృత్యువాత పడుతున్నారు. అయితే , కరోనా మహమ్మారి భారిన పడిన చిన్నపిల్లలు ఎక్కువ శాతం కరోనా పై పోరాటం చేసి విజయం సాధిస్తున్నారు. అయితే , కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయ్యి , కరోనా కి చికిత్స తీసుకోని కోలుకున్న తర్వాతే అసలు సమస్య మొదలవుతోంది. ఆ చిన్నారుల్లో మానసిక, ఆరోగ్య సమస్యలు దీర్ఘకాలం వెంటాడుతాయని ఆమెరికాకు చెందిన నిపుణుల బృందం ఓ కీలక నివేదికను బయటపెట్టింది. అమెరికాలో నిర్వహించిన ఓ సర్వే ప్రకారం.. 11 ఏళ్ల లోపు పిల్లలకు కరోనా తగ్గినప్పటికీ వాళ్లలో 13 శాతం మందికి లక్షణాలు వీడడం లేదని, అలాగే 12 నుంచి 16 ఏళ్ల వయసుల్లో పిల్లల్లో కరోనా తగ్గిన తర్వాత కూడా 17 శాతం మందికి లక్షణాలు వేధిస్తున్నాయని వెల్లడించింది.
పిల్లల్లో కరోనా సోకి తగ్గినా తర్వాత బాధలు సగటున 5 వారాల వరకు ఉన్నట్టు వెల్లడించారు. ఇక లక్షణాల విషయానికొస్తే, కరోనా నుంచి కోలుకున్న 12 ఏళ్ల లోపు పిల్లల్లో ఎక్కువగా అలసట, నిద్రలేమి, కాళ్లు, చేతులు నొప్పిపెట్టడం, తలనొప్పి, నీరసం, విరోచనాలు లాంటి ఇబ్బందులకి గురౌతున్నారు. కాబట్టి కరోనా నుంచి కోలుకున్న పిల్లల్ని 5 వారాల పాటు జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం అని చెప్తున్నారు. పిల్లలకు 5 వారాల పాటు సులభంగా అరిగే ఆహారం ఇవ్వాలని, జంక్ ఫుడ్ కు దూరంగా ఉంచాలని చెబుతున్నారు. ఎక్కువ సేపు విశ్రాంతి తీసుకునే వాతావరణాన్ని పిల్లలకు కల్పించాలని, అతిగా టీవీ చూడడం, మొబైల్ లో గేమ్స్ ఆడడం లాంటివి కొన్నాళ్ల పాటు నివారించాలని చెప్తున్నారు. ఇక భోజనం విషయానికొస్తే, కరోనా నుంచి కోలుకున్న పిల్లలకు రోగనిరోధక శక్తిని పెంచే పౌష్టికమైన ఆహారాన్ని ఎక్కువగా ఇవ్వాలి. రోజూ ఉడికించిన గుడ్డు, బాదం పప్పు అలవాటు చేయాలి. భోజనంలో పాలకూర, తృణధాన్యాలు ఉండేలా చూసుకోవాలి.