Begin typing your search above and press return to search.
ప్రపంచానికి ఆయన వార్నింగ్ ఇచ్చేశారు
By: Tupaki Desk | 5 Dec 2016 4:00 AM GMTసమస్త భూ మండలం మీదున్న అత్యంత మేధావుల్లో ఒకరుగా చెప్పాల్సి వస్తే.. అందులో స్టీఫెన్ హాకింగ్ పేరు తప్పనిసరిగా ఉండి తీరుతుంది. శరీరం మొత్తం చచ్చుబడినా.. సాంకేతిక సాయంతో తాను చెప్పాల్సిన విషయాన్నిఎప్పటికప్పుడు చెబుతూ.. ప్రపంచానికి దిశానిర్దేశం చేసే ఆయన నోటి నుంచి అనూహ్య రీతిలో హెచ్చరిక ఒకటి ఇచ్చేశారు. ప్రపంచం ప్రమాదకర పరిస్థితుల్లో ఉందని.. ఎట్టి పరిస్థితుల్లో దాన్ని క్షేమంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉందన్న మాటను చెప్పారు. తాజాగా ఆయన చేసిన సూచనతో కూడిన హెచ్చరిక .. భవిష్యత్ లో మనిషికి ఎదురయ్యే సవాళ్ల తీవ్రతను చెప్పకనే చెబుతుందని చెప్పాలి.
ప్రస్తుతం మానవజాతి ప్రమాదకర పరిస్థితుల్లో ఉందని.. చరిత్రలోనే ఇది అత్యంత గడ్డు పరిస్థితిగా ఆయన అభివర్ణించటం గమనార్హం. మానవాళి ఉనికే ప్రశ్నార్థకమయ్యే ముప్పు పొంచి ఉందని.. ప్రకృతిపరమైన సమస్యలతో పాటు.. సాంకేతిక సమస్యల్ని ఎదుర్కోవాల్సి వస్తోందని చెప్పారు.
భవిష్యత్తులో జరిగే ప్రమాదాలకు వార్నింగ్ ల మాదిరి ఇప్పటికే ప్రకృతి తరచూ హెచ్చరికలు జారీ చేస్తుందన్న ఆయన.. భూగోళాన్ని సమూలంగా నాశనం చేసే సాంకేతికతను అభివృద్ధి చేసుకున్నాం కానీ.. మరో గ్రహంలో బతికేందుకు వీలున్న దాన్నిఎంపిక చేసుకోవటంలో విఫలమయ్యామని పేర్కొన్నారు.‘‘మనకున్నది ఒకే గ్రహం. దీన్ని రక్షించుకోవటానికి మనమంతా కలిసికట్టుగా పని చేయాలి’’ అని చెప్పటం చూస్తే.. సమస్త మానవాళి అలెర్ట్ కావాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పక తప్పదు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/