Begin typing your search above and press return to search.
ప్రపంచంలో అత్యంత ఖరీదైన ఔషధం ఇదేనట..!
By: Tupaki Desk | 10 Dec 2022 11:30 PM GMTప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఔషధానికి అమెరికా ఆహార ఔషధ నియంత్రణ సంస్థ(ఎఫ్డీఏ) అనుమతి ఇచ్చింది. అత్యంత ప్రాణాంతకమైన.. అరుదైన వ్యాధికి సంబంధించి ఈ డ్రగ్ ను వాడతారు. దీనిని హీమోఫిలియా బీ చికిత్సలో జన్యు థెరపీల వాడుతారు. ఈ హెమ్‌జెనిక్స్ ఔషధాన్ని సీఎస్‌ఎల్ బెహ్రింగ్ సంస్థ తయారు చేసింది.
అమెరికాలో హీమోఫిలియా బీ వ్యాధి చికిత్సలో ఈ ఔషధాన్ని వాడేందుకు ఎఫ్డీఏ అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఈ డ్రగ్ సింగిల్ డోసు ధరను ఆ కంపెనీ 3.5 మిలియన్ డాలర్లుగా నిర్ణయించింది. మన కరెన్సీలో ఈ ఔషధం ధర సుమారు రూ.28 కోట్లు. దీంతో ప్రపంచంలోనే అత్యధిక ఖరీదైన ఔషధంగా హెమ్ జెనిక్స్ రికార్డు సృష్టించింది.
ఈ వ్యాధి విషయానికొస్తే రక్తం గడ్డకట్టడం వంటి సమస్యలతో 'హిమోఫిలియో బీ' వస్తుంది. కాలేయంలో ఉత్పత్తి అయ్యే ఫ్యాక్టర్ 9 (ix) అనే ప్రోటీన్ లోపంతో ఈ సమస్య ఏర్పడుతుంది. దీనిని నివారించడానికి సైంటిస్టులు గత కొన్నేళ్లు పరిశోధనలు చేపడుతున్నారు. ఎట్టకేలకు సీఎస్ఎల్ బెహ్రింగ్ ఔషధ తయారీ సంస్థ హిమోఫిలియో బీకి మందును కనిపెట్టింది.
ప్రపంచ వ్యాప్తంగా ప్రతీ 40 వేల మందిలో ఒకరు హిమోఫిలియో బీ సమస్యతో బాధపడుతున్నారని గణాంకాలు చెబుతున్నారు. ఈ అరుదైన వ్యాధికి ఇప్పటికే మార్కెట్లో కొన్ని రకాల చికిత్సలు ఉన్నాయి. అయితే ప్రస్తుతం సీఎస్ఎల్ తీసుకొచ్చిన ఔషధం దీర్ఘకాలం ప్రభావితంగా పని చేయనుందని తెలుస్తోంది.
హెమ్ జెనిక్స్ ఔషధం హిమోఫిలియో బీ వ్యాధి చికిత్సలో జన్యుపరంగా మార్పులు చేసి ఒక ప్రత్యేకమైన పదార్థాన్ని కాలేయంలో ప్రవేశపెట్టనుంది. తద్వారా కాలేయం నుంచి ఫ్యాక్టర్ 9 (ix) విడుదలవుతుందని సీఎస్ఎల్ కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. ఇక ఈ కంపెనీ మార్కెట్లోకి రెండు రకాల ఔషధాలను హిమోజెనిక్స్ ను అమెరికా మార్కెట్లో విక్రయాలను చేపడుతోంది.
ఇందులో మొదటి రకం ఔషధం విలువ 2.8 మిలియన్ డాలర్లు కాగా మరోక డ్రగ్ విలువ మూడు మిలియన్ డాలర్లుగా సీఎస్ఎస్ కంపెనీ నిర్ణయించింది. త్వరలోనే ఈ ఔషధాన్ని ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అన్నిరకాలు ఏర్పాట్లు చేస్తున్నట్లు సీఎస్ఎల్ కంపెనీ ప్రతినిధులు వెల్లడించారు. రాబోయే రోజుల్లో దీని ధర కొంతమేర తగ్గే అవకాశం ఉందని తెలిపారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.