Begin typing your search above and press return to search.
ఫేస్ బుక్ కంపెనీ కొత్త పేరు ఇదే
By: Tupaki Desk | 29 Oct 2021 4:38 AM GMTచెప్పి నట్లే తన కంపెనీ పేరు ను మార్చేశాడు ఫేస్ బుక్ సీఈవో మార్క్ జుకర్ బర్గ్. కొద్ది రోజుల క్రితం ఫేస్ బుక్ కంపెనీ పేరును ఆ పేరుతో కాకుండా మరో పేరు పెట్టనున్నట్లు చెప్పటం తెలిసిందే. మన కు బాగా తెలిసిన కంపెనీలనే తీసుకుంటే.. ‘ఈనాడు’ అన్నది బ్రాండ్ పేరు అయితే..దాని కంపెనీ పేరు ఉపోదయా పబ్లికేషన్స్.. అదే ‘ఆంధ్రజ్యోతి’ అయితే అమోదా పబ్లికేషన్స.. ‘సాక్షి’ అయితే జగతి పబ్లికేషన్స్ లిమిటెడ్. ఫేస్ బుక్ కు మాత్రం ప్రొడక్ట్ పేరు.. కంపెనీ పేరు ఒకటిగానే ఉండేది. ఈ మధ్యన చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యం లో తన కంపెనీ పేరు మార్చాలని డిసైడ్ చేశారు.
ఫ్యూచర్ లో తాము చేసే వ్యాపారాలకు.. దానికి ఉండే పేరుకు పోలిక లేకపోవటంతోనే ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నా.. కారణం మాత్రం వేరే అన్న మాట పలువురి నోట వినిపిస్తూ ఉంటోంది. ఇటీవల ఫేస్ బుక్ పేపర్ల పేరు తో బయటకు వచ్చిన పత్రాల తో సదరు సంస్థ తీవ్ర విమర్శల పాలైంది. ఈ నేపథ్యం లో దాని నుంచి ప్రజల చూపు మరల్చే ప్రక్రియ లో భాగం గానే కంపెనీ పేరును మార్చినట్లుగా చెబుతారు. ఇంతకీ.. ఫేస్ బుక్ కంపెనీ కి పెట్టిన కొత్త పేరు విషయానికి వస్తే.. చాలా సింఫుల్ గా తెలుగు లో అయితే రెండు అక్షరాల తో డిసైడ్ చేశారు. ఇక పై ఫేస్ బుక్ కంపెనీని ‘మెటా’ అనే పేరుతో వ్యవహరించనున్నారు.
కంపెనీ పేరు మార్చిన విషయాన్ని జుకర్ బర్గ్ స్వయం గా వెల్లడించారు. రానున్న రోజుల్లో వర్చువల్ రియాలిటీ సాంకేతికత కు పెరగనున్న ప్రాధాన్యత ను పరిగణ లోకి తీసుకొని ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. ఫేస్ బుక్ కంపెనీ కి చెందిన దాని ఉత్పత్తులైన ‘ఫేస్ బుక్’.. ‘ఇన్ స్టాగ్రాం’.. ‘వాట్సప్’ పేర్ల లో మాత్రం ఎలాంటి మార్పులు ఉండవని స్పష్టం చేయటం తెలిసిందే. కేవలం కంపెనీ పేరు మాత్రమే మారింది.
తమ కంపెనీని అందరూ సోషల్ మీడియా సంస్థ గానే చూస్తున్నారని.. కానీ తమది ప్రజల మధ్య అను సంధానత పెంచేందుకు అవసరమైన టెక్నాలజీ ని డెవలప్ చేసే కంపెనీ అని.. ఇందు లో భాగంగానే పేరు మార్చినట్లు చెబుతున్నారు. తాజాగా పెట్టిన ‘మెటా’ అన్నది గ్రీకు పదం గా జుకర్ వెల్లడించారు. మొత్తానికి ఫేస్ బుక్ కంపెనీ పేరు మారింది. దాని కొత్త పేరు ‘మెటా’ ప్రజల నోళ్లల్లో నానటానికి మరి కొంత కాలం పడుతుందని మాత్రం చెప్పక తప్పదు.