Begin typing your search above and press return to search.
పేదోనికి పెట్టు.. నేరస్థున్ని పట్టు.. ఇదే యోగి మంత్రం
By: Tupaki Desk | 11 March 2022 11:30 AM GMTరైతుల నుంచి వ్యతిరేకత.. లఖింపుర్ ఖేరీ ఘటన.. సమాజ్‌వాదీ పార్టీ నుంచి తప్పని హోరాహోరీ పోరు.. కరోనా కట్టడిలో వైఫల్యం.. ఇలా మరెన్నో సవాళ్లు కలిసి ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీని ఓడిస్తాయి.. ఇవీ ఎన్నికలకు ముందు వినిపించిన మాటలు. కానీ ఇప్పుడు వాటన్నింటీనీ బీజేపీ తలకిందులు చేసింది.
37 ఏళ్లలో వరుసగా రెండోసారి యూపీలో అధికారంలోకి వచ్చిన తొలిపార్టీగా చరిత్ర సృష్టించింది. రెండోసారి యోగి ఆదిత్యనాథ్‌ను సీఎం పీఠాన్ని అధిరోహించనున్నారు. మరి యూపీలో బీజేపీకి కలిసొచ్చిందేమిటీ? అక్కడి ఓటర్లను ఎలా తిప్పుకున్నారు? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ఆ రెండు అంశాలు..
యూపీలో బీజేపీ విజయానికి రెండు అంశాలే ప్రధానంగా దోహదపడ్డాయని చెప్పుకోవచ్చు. అందులో ఒకటి కరోనా కారణంగా తల్లడిల్లుతున్న పేదలకు ఉచితంగా గోధుమలు, బియ్యం పంపిణీ చేయడం. మరొకటి నేరస్థుల అడ్డగా పేరు తెచ్చుకున్న యూపీపై ఆ ముద్ర చెరేపేసే దిశగా నేరగాళ్లపై ఉక్కుపాదం మోపడం.
ఇవి రెండు కలిసి యోగిని రెండోసారి సీఎం చేయబోతున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కొవిడ్ మహమ్మారి నేపథ్యంలో 2020 తొలినాళ్ల నుంచి పేదలకు యోగి ప్రభుత్వం ఉచితంగా రేషన్ అందిస్తోంది.
పేద కుటుంబాల్లోని ఒక్కో వ్యక్తికి 5 కేజీల చొప్పున గోధుమలు, 5 కేజీల చొప్పున బియ్యం నెలనెలా పంపిణీ చేస్తోంది. అంతే కాకుండా ఒక్కో కుటుంబానికి లీటర్ రిఫైన్డ్ నూనె, కిలో చక్కెర, కిలో ఉప్పు కూడా ప్రతి నెలా అందుతున్నాయి. రాష్ట్రంలో 15 కోట్ల మంది రెండేళ్లుగా ఈ ప్రయోజనాలు పొందుతున్నారు.
ఆకలితో ఉన్నవాడి కడుపు నింపిన వాణ్ని దేవునిగా చూస్తారు. కరోనా కాలంలో ఉపాధి పోయి ఇబ్బందుల్లో చిక్కుకున్న ప్రజలను ఉచిత రేషన్‌తో ఆదుకున్న బీజేపీకి ఇప్పుడు ప్రజలు బ్రహ్మరథం పట్టారు.
వాళ్లపై ఉక్కుపాదం..
యోగి తన పాలనలో అత్యంత ప్రాధాన్యతనిచ్చిన మరో విషయం నేరస్తులపై ఉక్కు పాదం మోపడం. 2012-17 మధ్య సమాజ్‌వాదీ పార్టీ పాలనలో యూపీలో గూండాల అరాచకాలు హెచ్చుమీరాయనే ఆరోపణలున్నాయి. వాటిన అరికడతామని హామీ ఇచ్చి 2017లో తొలిసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ మాట నిలబెట్టుకుంది. సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి సంఘ విద్రోహ శక్తులపై యోగి ఉక్కుపాదం మోపారు. గ్యాంగ్‌స్టర్ వికాస్ దుబే సహా 182 మంది కరడుగట్టిన నేరగాళ్లను గత ఐదేళ్లలో యూపీ పోలీసులు హతమార్చారు. మరో 4,206 మంది నేరస్తుల కాళ్లలోకి తూటాలు దించారు.
21 వేల మందికి పైగా నేరగాళ్లను అరెస్టు చేశారు. మాఫియా వ్యక్తులకు చెందిన దాదాపు 2 వేల నిర్మాణాలను బుల్డోజర్లతో యోగి కూల్చివేయించారు. అక్రమార్కుల నుంచి 64 వేల హెక్టార్ల ప్రభుత్వ భూమిని తిరిగి స్వాధీనం చేసుకున్నారు. దీంతో బీజేపీ ప్రభుత్వంలో ఆకతాయిల ఆగడాలు తగ్గాయి. గూండాల భయం పోయింది. యోగి కారణంగానే స్వేచ్ఛగా తిరుగుతున్నామని భావించిన మహిళలు మరోసారి ఆయనకే జై కొట్టారు.