Begin typing your search above and press return to search.
సైరస్ మిస్త్రీ మరణానికి అసలు కారణం ఇదే.. తేల్చిన ఫోరెన్సిక్ టీం
By: Tupaki Desk | 8 Sep 2022 1:30 AM GMTటాటా సన్స్ మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీ మరణం ఇప్పుడు చర్చనీయాంశమైంది. అన్ని కోట్ల సంపద ఉండి.. ఒక కారులో అహ్మదాబాద్ నుంచి ముంబైకి ఒక సాధారణ పౌరుడిగా ఆయన రావడమే అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఈరోజుల్లో మధ్యతరగతి వారు కూడా ఇలా కారులో రెంట్ తీసుకొని వస్తున్నారు. చోటా మోటా ప్రముఖులు చార్టెడ్ ఫ్లైట్ బుక్ చేసుకొని వెళుతున్నారు. అంత పెద్ద పారిశ్రామికవేత్త ఇలా కారులో రావడం అన్నది ఎవరికీ అర్థం కాని విషయం. ఇక ఆయన రోడ్డు ప్రమాదంపై అనుమానాలు వ్యక్తం చేశారు. డ్రైవర్ కూడా లేకుండా ఓ స్నేహితురాలైన లేడీ డాక్టర్ కారు నడుపుతున్నట్టు తెలిసింది. ఈప్రమాదంలో ఆమె గాయపడ్డారు. దీంతో ఆయన మరణంపై ప్రభుత్వం విచారణకు ఆదేశాలు జారీ చేసింది.
చుట్టూ ఎన్నో ప్రశ్నలు తలెత్తాయి. ఇంకెన్నో సందేహాలు నెలకొంటున్నాయి. ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయిన సైరస్ మిస్త్రీ అంత్యక్రియలను మంగళవారం ముంబైలో నిర్వహించారు. సైరస్ మిస్త్రీ మరణంపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. పలు కోణాల్లో లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. డాక్టర్ అనాహిత పుండోల్ కారు నడుపుతున్నారు. పోలీసులు దీన్ని ప్రమాదంగా పరిగణించారు. సూర్య నదిపై ఉన్న హైవే డివైడర్‌ను కారు హైస్పీడులో ఢీకొట్టడంతో మిస్త్రీ మరియు పుండోల్స్ మరణించారని తెలిపారు. ఈ హైస్పీడుకు కారు ఎయిర్‌బ్యాగ్‌లు బయటకు వచ్చినా కూడా ప్రయాణికులను రక్షించడంలో విఫలమయ్యాయని తెలిపారు. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు.. మరో ఇద్దరు గాయపడ్డారు. మెర్సిడెస్ కారు తీవ్రంగా దెబ్బతింది.
ఈ ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్న ఫోరెన్సిక్ బృందం కీలక వివరాలు వెల్లడించింది. వంతెన ‘తప్పు డిజైన్’ కారణంగానే ప్రమాదం జరిగిందని తేల్చింది. వెనుక సీటులో ఉన్న వారు సీటు బెల్టులు ధరించకపోవడంతో మరణాలు సంభవించాయని పేర్కొంది.
ప్రమాదం జరిగినప్పుడు మెర్సిడేజ్ బెంజ్ ఎస్.యూవీ వాహనం భద్రాతా ప్రమాణాలు తమ పని తాముసరిగానే చేయాయని ఏడుగురు సభ్యుల బృందం తేల్చింది. ఎయిర్ బ్యాగులు ఓపెన్ అయ్యాయని తెలిపింది.
ఇక ప్రమాదం జరిగిన ప్రదేశానికి మీటర్ల దూరంలోనే రహదారి 3 లైన్ల నుంచి రెండు లైన్లకు కుచించుకుపోవడం ప్రమాదానికి కారణంగా తేలుస్తున్నారు. ఫోరెన్సిక్ లోని ఇద్దరు ఐఐటీ నిపుణులు .. ఇద్దరు మెకానికల్ సివిల్ ఇంజనీర్లు ఇదే విషయం చెబుతున్నారు. అతి వేగం.. రోడ్డు కుచించుకుపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని తేల్చారు. ప్రమాదం సమయంలో కారు వేగం బాగా ఉందని.. రోడ్డు చిన్నగా కావడంతో అంచనావేయలేక డివైడర్ ను ఢీకొట్టి మృతిచెందారని చెబుతున్నారు. కారు లోపాల వల్ల ఈ యాక్సిడెంట్ జరగలేదని చెబుతున్నారు. వంతెన డిజైన్ ప్రమాదానికి కారణమని ఫోరెన్సిక్ టీం చెబుతోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.