Begin typing your search above and press return to search.
లక్నో సూపర్ జెయింట్స్ 'లోగో' వెనకున్న అసలు అర్థం ఇదేనట
By: Tupaki Desk | 1 Feb 2022 10:30 PM GMTకొత్త ఏడాది వచ్చేసింది. సరికొత్త ఐపీఎల్ సిరీస్ షురూ అయ్యేందుకు మరికొన్ని నెలలే ఉన్నాయి. ఈసారి ఐపీఎల్ పండక్కి మరో రెండు జట్లు జాయిన్ అవుతున్న సంగతి తెలిసిందే. అందులో ఒకటి లక్నో సూపర్ జెయింట్స్ అయితే.. రెండోది అహ్మదాబాద్ ఫ్రాంఛైజీ. రెండో దానితో పోలిస్తే లక్నో ఫ్రాంచైజీ యమా ఫాస్ట్ గా ఉంది. తమ గురించి ప్రచారం కోసం.. ఏ చిన్న అవకాశాన్ని వదిలిపెట్టుకోకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తాజాగా తమ టీం లోగో వీడియోను భారీగా తయారు చేసి.. విడుదల చేశారు.
తమ అధికారిక ట్విటర్ ఖాతాలో పోస్టు చేసిన ఈ లోగో వీడియోలో.. తమ లోగోను సిద్ధం చేయటం వెనుక.. తాము పడిన శ్రమను తెలియజేసే ప్రయత్నంచేశారు. 22 సెకన్ల చిట్టి వీడియోలో.. తమ లోగోను ఒక భారీ సినిమాకు ఏ మాత్రం తీసిపోని రీతిలో రూపొందించారు. తమ లోగోను పురాణాల్నిస్ఫూర్తిగా తీసుకొని తయారు చేసినట్లుగా వెల్లడించారు. లోగోలో గరుడ పక్షి రెక్కల ఆకారంలో డిజైన్ చేసిన దాని కింద లక్నో సూపర్ జెయింట్స్ అని రాశారు.
శ్రీ మహావిష్ణువు వాహనం గరుడ పక్షి ఆధారంగా తమ టీమ్ లోగోలో రెక్కల్ని తయారు చేశామని.. ఆ రెక్కలకు భారత త్రివర్ణ పతాక రంగులతో రూపొందించినట్లుగా పేర్కొంది. అంతేకాదు..తమ జట్టును పాన్ ఇండియా స్థాయిలో పలు రాష్ట్రాల వారిని ఆకర్షించేలాడిజైన్ చేసినట్లుగా వెల్లడించారు. గరుడ పక్షి బాడీలో నీలి రంగులో క్రికెట్ బ్యాట్ ను పెట్టటం ద్వారా క్రికెట్ ఆటను చెప్పటం.. దీనిపై రెడ్ కలర్ బాల్ ను విజయ తిలకంగా రూపొందించినట్లు పేర్కొన్నారు. తమ జట్టు ప్రతి ఒక్క భారతీయుడిదంటూ ట్వీట్ ద్వారా పేర్కొంది.
మొత్తానికి తమ జట్టును వీలైనంత మందికి చేరువ అయ్యేందుకు ఉన్న ఏ చిన్న అవకాశాన్ని వదిలిపెట్టేందుకు లక్నో జట్టు సిద్ధంగా లేదన్న సందేశాన్ని ఇచ్చిందని చెప్పాలి. ఇక.. జట్టు విషయానికి వస్తే.. లక్నో జెయింట్స్ కు కెప్టెన్ గా కేఎల్ రాహుల్ ఎంపిక కావటం తలెిసిందే. అతన్ని రూ.17 కోట్లు పెట్టి కొనేసిన ఈ ఫ్రాంచైజ్.. రూ.9.2 కోట్లతో మార్కస్ స్టోయినిస్ ను.. రూ.4 కోట్లతో రవి బిష్ణోయ్ ను కొనేసింది. ఇక.. ఈ ఫ్రాంచైజీకి ఆండీ ఫ్లవర్ కోచ్ గా ఎంపికైతే.. టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ మెంటార్ గా వ్యవహరిస్తున్నారు. లోగో వీడియోతో అందరికి చేరువ కావాలన్న లక్నో సూపర్ జెయింట్స్ ఆశ ఎంతమేర నెరవేరుతుందో కాలమే సరైన సమాధానం ఇవ్వగలదని చెప్పక తప్పదు.