Begin typing your search above and press return to search.

వయసు ఎక్కువ అమ్మాయిలను పెళ్లిచేసకోవడానికి కారణం ఇదే..

By:  Tupaki Desk   |   20 Jan 2023 10:30 AM GMT
వయసు ఎక్కువ అమ్మాయిలను పెళ్లిచేసకోవడానికి కారణం ఇదే..
X
ఒక అబ్బాయికి పెళ్లి చేయాలంటే తనకంటే రెండు సంవత్సరాలు చిన్న వయసు ఉన్న అమ్మాయిని చూసేవారు పెద్దలు. కాలం మారుతున్న కొద్దీ యువతీ యువకులు పెద్దలకు పని చెప్పకుండా తమకు సమాన వయసు కలిగిన వారిని పెళ్లి చేసుకున్నారు. చదువు, వయసు అబ్బాయితో సమానంగా అమ్మాయికి ఉండడంతో అన్ని విషయాల్లో పోటీ పడుతున్నారు. ఈ క్రమంలో ఇగో హర్ట్ అయి మనస్పర్థలు వస్తున్నాయి. ఫలితంగా విడాకులు తీసుకొని ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. అయితే ఈ మధ్య కాలంలో చాలా మంది యువకులు తమ కంటే వయసు ఎక్కువగా ఉన్న అమ్మాయిలను పెళ్లి చేసుకుంటున్నారు. 2, 5 కాకుండా ఏకంగా 10 సంవత్సరాల పెద్ద వయసు ఉన్నా ఆమెనే కోరుకుంటున్నారు. ఇలాంటి వాళ్లను పెళ్లి చేసుకోవడంతో ఎన్నో ఉపయోగాలున్నాయట. అవేంటో చూద్దాం..

అబ్బాయి కంటే అమ్మాయి వయసు ఎక్కువగా ఉన్నప్పుడు ఆమెలో మేధా శక్తి ఎక్కువగా ఉంటుంది. కొన్ని సంవత్సరాలు ముందు జన్మించినందున ఆమెకు చాలా విషయాల్లో అనుభవం ఉంటుంది. తనను పెళ్లి చేసుకున్న అబ్బాయి చిన్నవాడైనందున చిన్న చిన్న తప్పులను క్షమించే గుణం ఉటుంది. ఉద్యోగం, వ్యాపారం విషయంలో అబ్బాయికి తోడుగా ఉన్నట్లయితే ఆమె మేధస్సు అబ్బాయి కంటే ఎక్కువగా పనిచేస్తుంది. ఒక రకంగా అబ్బాయి సక్సెస్ కావడానికి ఇలాంటి వారు వెనకుండి ప్రోత్సహిస్తూ ఉంటారు.

పొద్దంతా ఉద్యోగం, వ్యాపారం చేసిన మగాళ్లు ఇంటికి రాగానే కాస్త రిలాక్స్ కోరుకుంటారు. ఉద్యోగం, రాజకీయ విషయాలు తన భాగస్వామితో చర్చించడానికి ఇష్టపడుతారు. అబ్బాయికంటే తక్కువ వయసు ఉన్న అమ్మాయి ఇలాంటి విషయాలను పెద్దగా పట్టించుకోదు. అంతేకాకుండా బోర్ గా ఫీలయి అవైడ్ చేస్తుంది. ఈ క్రమంలో తనతో సహకరించడం లేదని అబ్బాయిలో వేరే ఫీలింగ్ వస్తుంది. అదే తనకన్నా పెద్ద వయసు మహిళ అయితే ఇలాంటి విషయాలు చర్చించడానికి ఆసక్తి చూపుతారు. అంతేకాకుండా అందులో ఉన్న లోసుగులు, భవిష్యత్ లో జరిగే పరిణామాల గురించి వివరిస్తారు. ఇలాంటి వారితో కలిసుండడానికి ఎక్కువగా ఇష్టపడుతారు.

ఎక్కవ వయసున్న వారిని పెళ్లి చేసుకోవడం ద్వారా వాళ్లు తమ భర్తలను చిన్న పిల్లల్లాగే ట్రీట్ చేస్తారు. ఈ క్రమంలో వారిపై అధిక ప్రేమను కురిపిస్తారు. ఇలాంటి ప్రేమలో అబ్బాయిలు తన్మయత్వం పొందుతారు. అంతేకాకుండా ప్రేమ, శృంగారం విషయంలో అవగాహన ఎక్కువగా ఉండడంతో వారికి సహకరించేందుకు ఇష్టపడుతారు. అబ్బాయిలు తమకంటే ఎక్కువగా బావోద్వేగం చెందేవారికి లైక్ చేస్తారనే విషయం తెలిసిందే. దీంతో వారి ప్రోత్సాహంతో మరింత తృప్తి పొందుతారు.

కుటుంబ విషయాల్లోనూ ఇలాంటి వారికి పట్టింపు ఉంటుంది. తన భర్త తనకన్నా చిన్నవాడైనందున తనే బాధ్యతగా కుటుంబ వ్యవహారాలను చక్కబెడుతుంది. చిన్న చిన్న విషయాలకే టెమ్ట్ కాకుండా అన్నింటినీ అర్థం చేసుకుంటుంది. దీంతో భర్తకు కూడా ఇంట్లో ఎలాంటి ఆందోళన వాతవరణం లేకపోవడంతో తను చేసే ఉద్యోగం, వ్యాపారం ఉత్సాహంగా చేస్తారు. అందువల్ల ఇలాంటి అమ్మాయిలను అబ్బాయిలు ఎక్కువగా ఇష్టపడుతారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.