Begin typing your search above and press return to search.

AP : విద్యుత్ సంక్షోభానికి కార‌ణం ఇదే !

By:  Tupaki Desk   |   10 April 2022 11:30 AM GMT
AP : విద్యుత్ సంక్షోభానికి కార‌ణం ఇదే !
X
వాస్త‌వానికి టీడీపీ అధికారంలోకి రాగానే విద్యుత్ రంగంలో కోత‌లు త‌ప్పవు అని తేలిపోయింద‌ని, కానీ చంద్ర‌బాబు స‌మ‌ర్థ పాలన కార‌ణంగా ఆ స‌మ‌స్య సునాయాసంగా గ‌ట్టెక్కింద‌ని ప్ర‌ధాన మీడియా వెల్ల‌డి చేస్తోంది. పీపీఏలు ర‌ద్దు చేయాల‌న్న ఆరాటం త‌ప్ప అందులో ఉన్న లోపాలేంటో, వాటిని దిద్దేందుకు ఏ త‌ర‌హా చ‌ర్యలు తీసుకోవాలో అన్న విష‌య‌మై ఏ నాడూ ప్ర‌భుత్వానికి స్ప‌ష్ట‌త లేద‌ని తేలిపోయింది.

ఇప్పుడున్న వివ‌రం ప్ర‌కారం మూడేళ్ల‌లో ఒక్క పీపీఏ కూడా చేసుకోలేద‌ని కూడా ప్ర‌ధాన మీడియా లో నిర్థారితం అయిన విష‌యం. అదేవిధంగా పీపీఏ ల స‌మీక్ష పేరుతో కాల‌హ‌ర‌ణం చేయ‌డంతో పాటు కొత్త‌గా ఒక్క‌టంటే ఒక్క విద్యుదాత్ప‌ద‌క సంస్థ కూడా ఇటుగా పెట్టుబ‌డులు పెట్టేందుకు రాలేద‌ని తెలుస్తోంది. ఇదే ప్ర‌ధాన మీడియాలో వెలుగు చూస్తున్న వాస్త‌వం. ఇంత జ‌రిగినా కూడా తాము విద్యుత్ కొనుగోలుకు మొగ్గు చూపుతున్నా కానీ బ‌హిరంగ మార్కెట్ త‌మ‌కు అనుకూలంగా లేద‌ని సంబంధిత అధికారులు చెప్ప‌డం విడ్డూరం.

ఆంధ్రావ‌నిలో విద్యుత్ కాంతుల స్థానంలో చీక‌ట్లు అల‌ముకుంటున్నాయి. ఎన్న‌డూ లేనివిధంగా అప్ర‌క‌టిత కోత‌లు వేధిస్తున్నాయి.ముఖ్యంగా ప‌ల్లెల‌లో మూడు నుంచి ఆరు గంట‌ల పాటు క‌రెంట్ కోత‌లు ఉంటున్నాయి అన్న వార్త‌లు కూడా వ‌స్తున్నాయి. ముఖ్యంగా కోత‌ల నివార‌ణ‌కు ప్ర‌భుత్వం తీసుకున్న ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌లేవీ లేక‌పోవ‌డమే సిస‌లు స‌మ‌స్య‌కు కార‌ణం అని తెలుస్తోంది.

ఈ నేప‌థ్యంలో వైసీపీ స‌ర్కారు మాత్రం విద్యుత్ కొనుగోలుకు పెద్ద‌గా ఆస‌క్తి చూప‌డం లేద‌ని, కేవ‌లం ప్ర‌క‌ట‌న‌ల‌కే ప‌రిమితం అవుతోంద‌ని విమ‌ర్శ‌లు కూడా వ‌స్తున్నాయి. వైసీపీ స‌ర్కారు అధికారంలోకి వ‌చ్చాక ఇప్ప‌టిదాకా ఒక్క‌టంటే ఒక్క మెగా యూనిట్ ను అద‌నంగా ఉత్ప‌త్తి చేయ‌లేద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. దీనినే ఇవాళ ప్ర‌ధాన మీడియా హైలెట్ చేస్తూ, గ‌త కాలంలో అంటే చంద్ర‌బాబు నాయుడు హ‌యాంలో తీసుకున్న నిర్ణ‌యాల‌ను మ‌రోసారి వెల్ల‌డి చేస్తోంది.

వైసీపీ అధికారంలోకి వచ్చాక ఉత్ప‌త్తికీ,వినియోగానికీ మ‌ధ్య లోటు పూడ్చేందుకు తీసుకుంటున్న చ‌ర్య‌లేవీ లేవు. ముఖ్యంగా థ‌ర్మ‌ల్ విద్యుత్ ప్లాంట్లు అన్నీ త‌మ ఉత్ప‌త్తి సామ‌ర్థ్యం క‌న్నా త‌క్కువ‌గానే ఉత్పత్తి ఇస్తూ, వినియోగ‌దారుల‌కు చుక్క‌లు చూపిస్తున్నాయి. గ‌త ప్ర‌భుత్వం హ‌యాంలో 8 వేల మెగా వాట్ల సౌర విద్యుత్ ను అందుబాటులోకి తెచ్చార‌ని, అటుపై జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చాక సీన్ రివర్స్ అయిపోయింద‌ని ప్ర‌ధాన మీడియా వెల్ల‌డిచేస్తోంది.

మ‌రోవైపు విద్యుత్ కొనుగోలు డ‌బ్బుల్లేక త‌ప్పించుకునే ధోర‌ణిలో త‌క్కువ ధ‌ర‌కు ఆన్లైన్ బిడ్డింగ్ లో పాల్గొంటున్న మ‌న రాష్ట్ర ఉత్ప‌త్తి సంస్థ‌లు త‌రువాత ఆ త‌ర‌హా ఫ‌లితాలు నెర‌వేర‌క చుక్క‌లు చూస్తున్నాయి.