Begin typing your search above and press return to search.
మళ్లీ 'మాచర్' సీన్.. కొట్టేసుకున్న టీడీపీ-వైసీపీ రీజన్ ఇదే!
By: Tupaki Desk | 30 Dec 2022 10:30 AM GMTపదే పదే 'మాచర్ల' సీన్.. అన్నట్టుగా మారిపోయింది టీడీపీ-వైసీపీ పరిస్థితి. టీడీపీ నేతలు నిర్వహించే కార్యక్రమాలకు వైసీపీ నాయకులు అడ్డంకులు సృష్టిస్తున్నారనే వాదన టీడీపీ నుంచి వ్యక్తమవుతోంది. ఇదే.. మాచర్లలోనూ రణరంగాన్ని సృష్టించింది.
మాచర్లలో ఇదేం ఖర్మ కార్యక్రమానికి హాజరైన టీడీపీ నేతలను వైసీపీ నాయకులు ఘర్షణ పడి అక్కడ నుంచి తరిమేయడం.. ఈ క్రమంలో దాడులు జరగడం తెలిసిందే.
తాజాగా మరోసారిఇదే సీన్ చిత్తూరులోనూ చోటు చేసుకుంది. చిత్తూరు జిల్లా సోమల మండలంలో టీడీపీ చేపట్టిన 'ఇదేం ఖర్మ రాష్ట్రానికి' కార్యక్రమంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. మండలంలోని పెద్ద ఉప్పరపల్లి, నంజంపేట తదితర గ్రామాల్లో నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ చల్లా రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో కార్యక్రమం ఏర్పాటు చేశారు.
దీనిలో పాల్గొనేందుకు ఆయన వెళ్తుండగా సోమల దళితవాడ వద్ద వైసీప నాయకులు అడ్డుకున్నారు.
ఆ తర్వాత రామచంద్రారెడ్డి నంజంపేట వెళ్లారు. అక్కడ టీడీపీ-వైసీపీ శ్రేణుల మద్య తోపులాట చోటుచేసుకుంది. ఈ క్రమంలో ఇరు పార్టీలకు చెందిన కార్యకర్తలు పరస్పరం రాళ్లతో దాడి చేసుకున్నారు. దీంతో టీడీపీ నేతలకు చెందిన పలు వాహనాల అద్దాల ధ్వంసమయ్యాయి.
అనంతరం పోలీసులు అక్కడికి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు. ఉద్రిక్తత నెలకొన్న నేపథ్యంలో టీడీపీ నాయకులు కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.