Begin typing your search above and press return to search.
తగ్గేదేలే.. అప్పుల్లో దేశంలోనే ఏపీ రికార్డు ఇలా!
By: Tupaki Desk | 17 Nov 2022 8:33 AM GMTఆంధ్రప్రదేశ్ అప్పులకుప్పగా మారుతోందా? అంటే అవుననే చెబుతోంది.. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్). కాగ్ లెక్కల ప్రకారం అప్పుల్లో ఆంధ్రప్రదేశ్‌లో దేశంలోనే నంబర్‌వన్ స్థానాన్ని దక్కించుకుంది. ఈ మేరకు కాగ్ లెక్కల ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తొలి 6 నెలల కాలానికి ఏ రాష్ట్రమూ కూడా ఏపీ తీసుకున్న స్థాయిలో రుణాలను తీసుకోలేదని కాగ్ తాజా లెక్కలు చెబుతున్నాయి.
ఏడాది మొత్తం మీద ఎంత రుణం అవసరం అవుతుందని జగన్ ప్రభుత్వం అంచనా వేసిందో ఆ అప్పును 6 నెలల్లోనే సమీకరించేయడం గమనార్హం. సెప్టెంబర్ నెలాఖరు వరకు ఆంధ్రప్రదేశ్ రూ.49,263.34 కోట్లు అప్పు చేసింది.
వాస్తవానికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏడాది మొత్తం మీద రూ.48,724.12 కోట్ల రుణం అవసరమవుతుందని ఆంధ్రప్రదేశ్ అంచనాలు రూపొందించింది. అయితే ఆరు నెలల్లోనే అంటే సెప్టెంబర్ చివరి నాటికే ఏకంగా రూ.49,263.34 కోట్ల రుణాన్ని రాష్ట్రం వినియోగించుకుంది.ఈ మేరకు ప్రతి నెలా కాగ్ వెలువరించే లెక్కల ఆధారంగా ఈ విషయం వెల్లడైందని చెబుతున్నారు.
అత్యధిక అప్పుల్లో ఏపీ తర్వాత బిహార్ రెండో స్థానంలో నిలిచింది. బిహార్ ఒక్కటే ఏడాది మొత్తం మీద రూ.25,885.10 కోట్ల రుణం అవసరమవుతుందని అంచనాలు రూపొందించింది. అయితే తొలి 6 నెలల్లో రూ.30,407.14 కోట్ల రుణం సమీకరించిందని కాగ్ వెల్లడించింది. ఈ లెక్కలను పరిగణనలోకి తీసుకున్నా ప్రతిపాదిత అప్పు, వినియోగించిన అప్పు విషయంలో ఆంధ్రప్రదేశ్ ముందుందని అంటున్నారు.
ఇక తెలంగాణ ఈ ఆర్థిక సంవత్సరానికి రూ.52,167.21 కోట్లు అవసరమని అంచనాలు కాగ్‌కు ప్రతిపాదించింది. అయితే సెప్టెంబర్ నెలాఖరు వరకు రూ.21,173.23 కోట్ల అప్పు మాత్రమే సేకరించింది. అలాగే ఏపీ పొరుగు రాష్ట్రమైన తమిళనాడు రూ.96,613.71 కోట్ల రుణం అవసరమని ప్రతిపాదించగా సెప్టెంబర్ నెలాఖరు వరకు రూ.18,726.34 కోట్ల అప్పు చేసింది. ఈ అప్పులకు బడ్జెట్‌లో చూపని కార్పొరేషన్ల రుణాలు, ఇతర మొత్తాలు అదనమని అంటున్నారు.
కాగా రాష్ట్ర అప్పుల ముప్పుపై కేంద్ర ప్రభుత్వంతోపాటు ఆర్థిక నిపుణులు, ఆర్బీఐ గతంలోనే ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఈ ఏడాది జులై చివర్లో కేంద్ర ఆర్థికశాఖ అధికారులు దేశంలోని వివిధ రాష్ట్రాలతో ఆర్థిక పరిస్థితులపై సమావేశం నిర్వహించి అప్పులపై జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు.
ఆ సమావేశంలో కేంద్ర అధికారులు కొన్ని రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందని తెలిపారు. అప్పుల విషయంలో ఆచితూచి వ్యవహరించకపోతే శ్రీలంక తరహాలో ఆర్థిక సంక్షోభం బారిన పడే ప్రమాదముందని హెచ్చరించారు. ఈ సమావేశంలో అనేక రాష్ట్రాలతోపాటు ఆంధ్రప్రదేశ్ అప్పులపైనా కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది.
ఈ క్రమంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి 6 నెలల్లో ఇతర రాష్ట్రాల కన్నా ఏపీ ఎక్కువ రుణాలు తీసుకోవడంపై కాగ్ వెలువరించిన లెక్కలు తాజాగా చర్చనీయాంశంగా మారాయి.
వైసీపీ అధికారంలో వచ్చినప్పటి నుంచి అంటే 2019–20 నుంచి 2021–22 వరకు కేంద్రం వద్ద ఉన్న గణాంకాల ఆధారంగా ఆంధ్రప్రదేశ్ అప్పటికే బడ్జెట్‌లో చూపని అప్పులు పెద్ద మొత్తంలో చేసినట్లు జూలైలో జరిగిన సమావేశం కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. బడ్జెట్‌లో చూపని రుణాల ఆధారంగా ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మూడో స్థానంలో ఉన్నట్లు తేల్చింది.
మరోవైపు ఆంధ్రప్రదేశ్... బేవరేజస్ కార్పొరేషన్ ద్వారా తీసుకున్న రూ.8,300 కోట్ల రుణం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తీసుకున్నదేనని చెబుతున్నారు. ఆర్థిక సంఘం, కేంద్ర ఆర్థికశాఖ లెక్కల ప్రకారం అయితే ఈ రుణాన్ని కూడా ప్రభుత్వ రుణంగానే పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని అంటున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రం ఈ కార్పొరేషన్ల ద్వారా తీసుకున్న అప్పులను కాగ్‌కు తెలియజేయడం లేదని సమాచారం. ఈ నేపథ్యంలో జగన్ ప్రభుత్వం కాగ్‌కు సమర్పించిన రూ.49,263 కోట్ల రుణం కన్నా ఇంకా ఎక్కువే ఆంధ్రప్రదేశ్ అప్పులు ఉంటాయని చెబుతున్నారు.
దేశంలో పెద్ద రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్ రూ.15 వేల కోట్లు, మధ్యప్రదేశ్ రూ.14 వేల కోట్లు, రాజస్థాన్ రూ.22 వేల కోట్లు, పశ్చిమ బెంగాల్ రూ.26 వేల కోట్లు, కర్ణాటక రూ.1685 కోట్లు మాత్రమే అప్పు చేశాయి. ఈ రాష్ట్రాల కంటే చిన్నదైన ఏపీ మాత్రం రూ.49263 కోట్లు అప్పు చేసింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.