Begin typing your search above and press return to search.

చిరును ముగ్గులోకి లాగేలా ఫైర్ బ్రాండ్‌ ట్వీట్‌

By:  Tupaki Desk   |   1 Feb 2019 7:20 AM GMT
చిరును ముగ్గులోకి లాగేలా ఫైర్ బ్రాండ్‌ ట్వీట్‌
X
కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ రాముల‌మ్మ చేసిన ట్వీట్లు ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారాయి. ఏపీ రాజ‌కీయాల‌పై తెలంగాణ కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ గా పేరున్న రాముల‌మ్మ ఒక‌టి త‌ర్వాత ఒక‌టిగా ట్వీట్లు చేయ‌టం ఒక ఎత్తు అయితే.. ఏపీ ప్ర‌జ‌లు కాంగ్రెస్ ను బ‌ల‌ప‌ర్చాల్సిన అవ‌స‌రాన్ని చెప్ప‌టం మ‌రో ఎత్తు. ప‌నిలో ప‌నిగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారో లేరో అన్న అనుమానాలు రేకెత్తేలా వ్య‌వ‌హ‌రిస్తున్న మెగాస్టార్ చిరంజీవిని ఉద్దేశించి ఆమెట్వీట్లు చేశారు.

తాజాగా విజ‌య‌శాంతి చేసిన ట్వీట్ల‌తో అంతో ఇంతో రియాక్ట్ అయ్యేలా రాముల‌మ్మ ట్వీట్లు చేశార‌ని చెప్పాలి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ స్టార్ క్యాంపెయిన‌ర్ గా వ్య‌వ‌హ‌రించిన ఆమె.. ఇటీవ‌ల కాలంలో ఏపీ రాజ‌కీయాల మీద దృష్టి పెట్ట‌టం ఆస‌క్తిక‌రంగా మారింది. విభ‌జ‌న నేప‌థ్యంలో కాంగ్రెస్ పార్టీ అంటేనే మండిప‌డుతున్న ఏపీ ప్ర‌జ‌ల మ‌న‌సుల్ని దోచుకునే బాధ్య‌త‌ను విజ‌య‌శాంతికి అప్ప‌జెప్పారా? అన్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది.
తాజాగా విజ‌య‌శాంతి చేసిన ట్వీట్ల‌లోని ముఖ్యాంశాల్ని చూస్తే..

+ ఇప్పుడు ఏపి పొలిటిక‌ల్ స‌ర్కి ల్స్ లో హ‌ట్ టాపిక్ అయింది. గత రెండు రోజులుగా ఏపీ రాజకీయ పరిమాణాలను గమనించి చూస్తుంటే ప్రధాన పార్టీల తీరు ఒకింత ఆశ్చర్యంగా, మరింత గందరగోళంగా అనిపిస్తోంది.

+ బీజేపీ తప్ప మిగిలిన అన్ని పార్టీలూ ప్రత్యేక హోదా కోసం డిమాండ్ చేస్తున్నాయి. ఈ వాదంతో అన్ని పార్టీలూ మైలేజ్ పెంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. అంతేకానీ.. వారు ఏకథాటి పైకి రారు.

+ వైసీపీ, టీడీపీలు ఒకరితో మరొకరు వాదనలు చేసుకుంటారు. కానీ ఇద్దరూ కలిసి బీజేపీతో పోరాటం చెయ్యరు. వైసీపీ, జనసేన పార్టీల మధ్య కూడా ఇదే దృశ్యం కనిపిస్తోంది. మరి ఒక లక్ష్య సాధన కోసం ఏకథాటి పైకి రాలేకపోతే ఈ పార్టీలు బీజేపీపై ఎలా ఒత్తిడి తీసుకొస్తాయి?

+ జనసేనతో సహా అన్ని ప్రధాన పార్టీలు, కాంగ్రెస్‌ను బలపరచకుండా ప్రత్యేక హోదా రాదన్న లాజిక్ మిస్సవుతున్నాయి. ఎందుకంటే ప్రత్యేక హోదాకు అనుకూలంగా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే తీర్మానం చేసింది.

+ ఈ తరుణంలో, వారి లక్ష్యసాధన కోసం ఏపీకి చెందిన అన్ని ప్రధాన పార్టీలు కాంగ్రెస్‌తో కలిసి రావాలని నేను అనుకుంటున్నాను. తెలుగు ప్రజలలో మంచి పాపులారిటీ ఉన్న చిరంజీవి గారి లాంటి ప్రముఖులంతా ఏపీ ప్రజల ప్రత్యేక హోదా కలను నిజం చేయడానికి.. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి ఇదే సరైన సమయం.

+ ప్రత్యేక హోదా ఆశ మాత్రం జీవం కోల్పోతుంది. నిబద్ధత కలిగిన ఒక కాంగ్రెస్ కార్యకర్తగా ఇది నా అభిప్రాయం.