Begin typing your search above and press return to search.

6 నెలల్లోనే రెట్టింపు .. చరిత్రలో ఆరోసారి : డబ్ల్యూహెచ్ వో

By:  Tupaki Desk   |   28 July 2020 1:30 PM GMT
6 నెలల్లోనే రెట్టింపు .. చరిత్రలో ఆరోసారి :  డబ్ల్యూహెచ్ వో
X
ప్రపంచవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య కేవలం ఆరు వారాల్లోనే రెట్టింపు అయింది అని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనోమ్ ఘెబ్రెయేసుస్ ప్రకటించారు. కరోనా వైరస్ ప్రపంచ మహమ్మారిగా ప్రకటించి ఈ నెల 30 కి ఆరు నెలలు పూర్తి అవుతుంది. దీనితో ఆయన తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ విధంగా ఆరోగ్య అత్యవసర స్థితిని ప్రకటించడం చరిత్రలో ఇది ఆరోసారి అని ఆయన తెలిపారు. అలాగే ఈ మహమ్మారి ప్రపంచాన్ని మార్చేసిందని తెలిపారు.

జనవరి 30న తాము ఎమర్జెన్సీని ప్రకటించే సమయంలో చైనా వెలుపల 100 కంటే తక్కువ కేసు ఉండగా మరణాలు నమోదు కాలేదని తెలిపారు. అలాగే ప్రపంచ ఆరోగ్య సంస్థ వద్ద ఉన్న వివరాల ప్రకారం ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా కోటి 60 లక్షల కరోనా కేసులు నమోదు, కాగా 6,40,000 వేల మంది కరోనా భారిన పడి మృతి చెందారని తెలిపారు. అయితే , ఈ కరోనా వ్యాప్తి ఇక్కడితో ఆగిపోదు అని , మరింత బలం పుంజుకుంటుందనే అభిప్రాయాన్ని అయన వ్యక్తం చేశాడు. ఈ నేపథ్యంలో సామాజిక దూరం, చేతులు శుభ్రం చేసుకోవటం ,సమూహాలలోకి వెళ్లక పోవడం, పేస్ మాస్కులు ధరించడం వంటి నియమాలు పాటించాలని , అన్నింటికి మించి నాకు రాకూడదు , నా వల్ల ఇతరులకి రాకూడదు అని అనుకోవాలని తెలిపారు.