Begin typing your search above and press return to search.

అదృష్టం కొద్దీ బయటకు.. అత్యుత్సాహంతో మళ్లీ జైలుకు!

By:  Tupaki Desk   |   16 Dec 2021 3:02 PM IST
అదృష్టం కొద్దీ బయటకు.. అత్యుత్సాహంతో మళ్లీ జైలుకు!
X
అదృష్టం కొద్దీ నాలుగేళ్ల జైలు శిక్ష కాస్త రెండు రోజులకే పరిమితం అయింది. నాలుగు సంవత్సరాలు కటకటాల వెనక ఉండాల్సిన ఆయన... రెండో రోజునే బయటకు వచ్చాడు. అయితే గుట్టుచప్పుడు కాకుండా ఇంట్లో ఉండకుండా ఓ పార్టీ చేసుకున్నాడు. ఉత్సాహంగా సాగిన పార్టీ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశాడు.

ఆ ఫొటోలు లేనిపోని తంటాలు తీసుకొచ్చాయి. జైల్లో ఉండాల్సిన ఆ వ్యక్తి బయటకు ఎలా వచ్చాడని అతడి స్నేహితులు ఆరా తీశారు. అంతేకాకుండా జైలు అధికారులకు సమాచారం ఇచ్చారు. ఇంకే సీన్ రివర్స్ అయింది. అత్యుత్సాహంతో పార్టీ చేసుకోవడం వల్ల మళ్లీ జైలుకెళ్లే పరిస్థితి ఏర్పడింది. లారాస్ మాటియుసోవాస్ అనే వ్యక్తి స్టోరీ ఇది.


లారాస్ మాటియుసోవాస్ అనే వ్యక్తికి జైలు శిక్ష విధించింది కోర్టు. ఓ బ్లాక్ మెయిల్ కేసులో భాగంగా శిక్షను ఖరారు చేస్తూ నార్త్ లండన్ డ్ గ్రీన్ క్రౌన్ కోర్టు నాలుగేళ్ల శిక్షను ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జైలు అధికారులు అతడిని కారాగారానికి తీసుకెళ్లారు. ఇంతలో ఏమైందోఏమో గానీ రెండు రోజులు కాగానే అతడిని వదిలేశారు.

జైలు నుంచి విడుదల కాగానే ఓ పార్టీ చేసుకున్నాడు. ఈ ఆ పార్టీనే అతడికి లేనిపోని తలనొప్పలు తీసుకొచ్చింది. పార్టీకి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీనిపై అతడి స్నేహితుడు ఫిర్యాదు చేశాడు.

జైలు అధికారులు లంచం తీసుకొని లారాస్ ను విడుదల చేశారని ఆరోపించాడు. లేదంటే నాలుగేళ్లు శిక్ష పడిన వ్యక్తి రెండు రోజుల్లో ఎలా వస్తాడని ప్రశ్నించాడు. ఈ విషయం కాస్తా జైలు అధికారుల దాకా వెళ్లింది.

వాళ్లు వెంటనే రంగంలోకి లారాస్ ను పట్టుకున్నారు. మళ్లీ జైలుకు తీసుకెళ్లారు. కోర్టులో కొన్ని పత్రాలు రాసే సమయంలో తలెత్తిన లోపాల వల్లే లారాస్ ను విడుదల చేశారని అధికారులు తెలిపారు. అక్కడ జరిగిన పొరపాటును గుర్తించామని చెప్పారు. ఇకపై ఇలాంటివి జరగకుండా చూసుకుంటామని స్పష్టం చేశారు.

లారాస్ అదృష్టం కొద్దీ బయటకు వచ్చి... అత్యుత్సాహంతో మళ్లీ పోలీసులకు చిక్కడం అంశం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కొన్ని రోజుల పాటు బయటకు రాకుండా ఉంటే బాగుండు కదా అని నెటిజన్లు అంటున్నారు. పార్టీ తెచ్చిన తంటాతో నాలుగు ఏళ్ల పాటు జైల్లోనే ఉండాలా? పాపం అని కామెంట్ చేస్తున్నారు.