Begin typing your search above and press return to search.

వైసీపీలో సైలెంట్ నేతల వ్యూహం ఇదే.. సీక్రెట్‌గా చూస్తోన్న‌ అధిష్టానం..!

By:  Tupaki Desk   |   28 Aug 2022 2:30 AM GMT
వైసీపీలో సైలెంట్ నేతల వ్యూహం ఇదే.. సీక్రెట్‌గా చూస్తోన్న‌ అధిష్టానం..!
X
ఏపీ అధికార పార్టీ వైసీపీ అంటేనే ఫైర్‌. పైర్‌బ్రాండ్‌కు కేరాఫ్‌గా అనేక మంది నాయ‌కులు మ‌న‌కు ఈ పార్టీ లో క‌నిపిస్తారు. అంతేకాదు.. టీడీపీపై పైనా.. వైసీపీ అధినేత జ‌గ‌న్‌ను కార్న‌ర్ చేసేవారిపైనా.. విరుచుకు ప‌డే వారు కోకొల్ల‌లు.. అనే మాట వినిపిస్తూ ఉంటుంది.

అయితే.. ఇది గ‌త రెండేళ్ల కింద‌టి వ‌ర‌కు మాత్ర‌మే. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఎవ‌రి సేఫ్ వారు చూసుకుంటున్నార‌నే వాద‌న వినిపిస్తోంది. దీనికి కార‌ణం కూడా జ‌గ‌నేన‌నే వాద‌న ఉంది. ఆయ‌న త‌న సేఫ్ తాను చూసుకుంటున్నారు.

క్షేత్ర‌స్థాయిలో ఎమ్మెల్యేల‌ను.. ఎంపీల‌ను ప‌ట్టించుకోవ‌డం లేదు. ఏదో కొద్ది మందితో మాత్ర‌మే జ‌గ‌న్ ట‌చ్‌లోకి వ‌స్తున్నారు. దీంతో మెజారిటీ నేతలు.. ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. దీనికి కార‌ణం.. త‌మ సేఫ్ తాము చూసుకోవ‌డ‌మే. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి వైసీపీ హ‌వా పెరిగితే.. ఫ‌ర్వాలేదు. లేక‌పోతే.. ఏమాత్రం తేడా వ‌చ్చినా.. నాయ‌కులు జంప్ చేసేందుకు.. వారి వారి సేఫ్ చూసుకునేందుకు ప‌క్కా వ్యూహంతో ముందుకు సాగుతున్నారు.

ఇలాంటి వారిలో మాజీ మంత్రులు కుర‌సాల క‌న్న‌బాబు స‌హా అనేక మంది పేర్లు వినిపిస్తున్నాయి. పార్టీలో ఎంత చేసినా.. ఎంత‌గా విరుచుకుప‌డినా.. కొంద‌రికి ఉన్న ప్రాధాన్యం త‌మ‌కు లేక పోవ‌డమే కార‌ణంగా క‌నిపిస్తోంది. పైగా.. ప్ర‌భుత్వానికి అనుకూలంగా ప్ర‌జ‌ల్లో ప్రచారం చేయాల‌ని జ‌గ‌న్ చెప్ప‌డం వ‌ర‌కు మంచిదే అయినా.. అదే ప్రామాణికంగా తీసుకుని.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్లు ఇస్తాన‌ని చెప్ప‌డాన్ని చాలా మంది నాయ‌కులు జీర్ణించుకోలేక పోతున్నారు.

ఎన్నిక‌ల ప‌రిస్థితి ఎప్పుడు ఎలా ఉంటుందో .. ఎవ‌రూ చెప్ప‌లేరు. గత ఎన్నిక‌ల‌కు ముందు .. టీడీపీ ప‌రిస్థితి చాలా బాగుంద‌నే టాక్ వ‌చ్చింది. కానీ, ఎన్నిక‌ల్లో ఎదురు దెబ్బ‌త‌గిలింది. ఇప్పుడు కూడా వైసీపీ ప‌రిస్థితి బాగున్నా.. బాగాలేకున్నా.. అది నాయ‌కుల వ‌ల్లే కార‌ణం కాదు.. పాల‌న ప్ర‌భావం కూడా ఉంటుంది.

ఈ సునిసిత విష‌యాన్ని అంచ‌నా వేయ‌డంలో పార్టీ అధిష్టానం ఎక్క‌డో విఫ‌ల‌మై.. త‌మ‌పైనే భారం వేస్తుండ‌డాన్ని మెజారిటీ నాయ‌కులు హ‌ర్షించ‌లేక పోతున్నారు. అందుకే.. ఎవ‌రికివారు.. తమ సేఫ్ తాము చూసుకుంటున్నార‌ని అంటున్నారు. ఇదే విష‌యాన్ని అధిష్టానం కూడా నిశితంగా ప‌రిశీలిస్తోంది. మ‌రి ఏం చేస్తారో చూడాలి.