Begin typing your search above and press return to search.
నిర్భయ దోషి క్షమాభిక్ష కు సుప్రీం రియాక్షన్ ఇదే..
By: Tupaki Desk | 29 Jan 2020 7:24 AM GMTతప్పులు అందరూ చేస్తారు. ఘోరమైన తప్పులు కొందరే చేస్తారు. నిర్భయ దోషులు చేసిన లాంటి అమానమీయమైన తప్పులు అతి కొద్ది మందే చేస్తారు. అలాంటి వారి విషయంలో ఎలాంటి దయ..జాలి చూపించాల్సిన అవసరం లేదు. అయితే.. చట్టం.. న్యాయసూత్రాల ప్రకారం శిక్ష పొందిన ఖైదీకి సైతం కొన్ని హక్కులు ఉంటాయి. అయితే.. వాటిని ఆధారంగా చేసుకొని కోర్టులు ఇచ్చిన తీర్పులు అమలు కాకుండా ఉండేందుకు కొందరు చేసే ప్రయత్నాలు మామూలుగా ఉండవు.
నిర్భయ దోషులు ఇప్పుడా కోవలోకే వస్తారు. తాము చేసిన దారుణమైన నేరానికి కుమిలి పోయి.. కోర్టు విధించిన ఉరిశిక్షకు సిద్ధమైతే ఏ గొడవా ఉండేది కాదు. న్యాయసూత్రాల్లో ఉండే లొసుగుల్ని ఆధారంగా చేసుకొని తమకు విధించిన ఉరిని తప్పించుకోవటానికి.. శిక్ష అమలులో కాలయాపన చేయటానికి ఉన్న ప్రతి అవకాశాన్ని వారు వినియోగించుకుంటున్నారు. ఇందులో భాగంగా నిర్భయ దోషుల్లో ఒకడైన ముకేశ్ సింగ్ తాజాగా సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.
జైల్లో తనపై అత్యాచారం చేశారని.. తాను వేధింపులకు గురైన నేపథ్యం లో తనకు క్షమాభిక్ష ప్రసాదించాలంటూ సుప్రీం కోర్టు ను అభ్యర్థించారు. ఇందు లో భాగంగా ఒక పిటిషన్ ను దాఖలు చేశారు. తాజాగా ఈ పిటిషన్ మీద విచారణ జరిపిన సుప్రీంకోర్టు ముకేశ్ విన్నపాన్ని కొట్టేసింది. ముకేశ్ వాదనలో ఎలాంటి మెరిట్ లేదని.. జైల్లో దోషి ఎదుర్కొన్న బాధను ఆధారంగా చేసుకొని క్షమాభిక్ష తిరస్కరణను సవాల్ చేయటం సరికాదని పేర్కొంది.
కేవలం జైల్లో తనను వేధించారన్న కారణంగా రాష్ట్రపతి నిర్ణయాన్ని సమీక్షించలేమని పేర్కొంది. క్షమాభిక్షను వేగంగా రిజెక్ట్ చేయటమంటే దాని అర్థం ఆలోచన లేకుండా తీసుకున్న నిర్ణయం కాదని పేర్కొంది. నిర్భయ దోషుల్లో ఒకరైన ముకేశ్.. ఇటీవల రాష్ట్రపతిని క్షమాభిక్ష కోరుతూ పిటిషన్ పెట్టుకుననారు. దీన్ని రాష్ట్రపతి రిజెక్టు చేశారు. దీనిపై సుప్రీం కోర్టు ను ఆశ్రయించి.. జైల్లో తనపై అత్యాచారం తో పాటు.. వేధింపులకు గురి చేశారని.. ఈ నేపథ్యంలో తన క్షమాభిక్ష పిటిషన్ ను రిజెక్టు చేయటాన్ని మళ్లీ సమీక్షించాలని సుప్రీంను కోరారు. ఈ పిటిషన్ ను కొట్టేస్తూ అత్యున్నత న్యాయస్థానం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యం లో ముందుగా అనుకున్నట్లే ఫిబ్రవరి ఒకటిన నిర్భయ దోషులకు ఉరి తీస్తారా? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.