Begin typing your search above and press return to search.

టీడీపీలో ఇదే వీక్‌నెస్‌.. త‌మ్ముళ్లు మారాల్సిందే..!

By:  Tupaki Desk   |   26 Aug 2022 4:30 AM GMT
టీడీపీలో ఇదే వీక్‌నెస్‌..  త‌మ్ముళ్లు మారాల్సిందే..!
X
ఏపీలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీకి నేత‌లు ఉన్నారు. భారీ సంఖ్య‌లో ఉన్నారు. అయితే.. వారు చంద్ర‌బా బు పిలుపు ఇస్తే.. బ‌య‌ట‌కు రావ‌డం లేదు. ఇదిగో ఈ కార్య‌క్ర‌మం చేప‌ట్టండి.. అదిగో అలా ప్ర‌జల మ‌ధ్య కు వెళ్లండి.. అని చంద్ర‌బాబు ప‌దే ప‌దే చెబుతున్నా.. వారు ప‌ట్టించుకోవ‌డం లేదు. ఏదో కొద్ది మంది మాత్ర‌మే.. బ‌య‌ట‌కు వ‌స్తున్నారు. మ‌రికొంత మంది మాత్ర‌మే ప్ర‌జ‌ల‌కు చేరువ‌గా ఉంటున్నారు. దీంతో విసిగిపోయిన చంద్ర‌బాబు.. టికెట్ల భ‌యం పెట్టారు.

అయితే.. మాకు త‌ప్ప ఇంకెవ‌రికి టికెట్లు వ‌స్తాయ‌నే ధీమానో.. ఏమో తెలియ‌దు కానీ.. అప్పుడు కూడా నాయ‌కులు అనుకున్న విధంగా బ‌య‌ట‌కు రాలేదు. దీంతో చంద్ర‌బాబు త‌నేస్వ‌యంగా బ‌య‌ట‌కు వ‌స్తున్నారు. పార్టీ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్నారు.

ఉద్య‌మాల‌కు శ్రీకారం చుడుతున్నారు. క‌ట్ చేస్తే.. ఇలాంటి స‌మ‌యాల్లో ఏదైనా అల‌జ‌డి జ‌రిగితే.. టీడీపీ సైన్యం ఒక్క‌సారిగా స్పందిస్తోంది. చంద్ర‌బాబు కు మ‌ద్ద‌తుగా రోడ్డెక్కుతోంది. ప్ర‌భుత్వంపై నిప్పులు చెరుగుతోంది.

మ‌రి ఇప్ప‌టి వ‌ర‌కు ఈ సైన్యం ఏం చేస్తున్న‌ట్టు..? అనేదే మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌. తాజాగా కుప్పంలో చంద్ర‌బాబుపై జ‌రిగిన దాడులు.. పార్టీ అన్న క్యాంటీన్ విధ్వంసం.. నాయ‌కుల‌పై.. రాళ్ల‌దాడి.. వంటి ఘ ట‌న‌ల‌తో అట్టుడికిపోయిన విష‌యం తెలిసిందే.

ఈ ప‌రిణామాల‌కు నిర‌స‌న‌గా.. రాష్ట్ర వ్యాప్తంగా త‌మ్ముళ్లు క‌దం తొక్కారు. ప్ర‌బుత్వంపై తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. చంద్ర‌బాబుకు సంఘీభావంగా మండ‌ల కేంద్రాలు.. పార్టీ కార్యాల‌యాల్లో.. స‌మావేశాలు పెట్టారు. అధికార పార్టీ నేత‌ల‌కు హెచ్చ‌రిక‌లు జారీ చేశారు.

మ‌రి.. ఇంత సంఘీభావం.. పార్టీని బ‌లోపేతం చేసేందుకు ఎందుకు చూపించ‌డం లేదు.. అనేది ప్ర‌ధాన ప్ర‌శ్న‌. మ‌రో ఏడాదిన్న‌ర‌లో ఎన్నిక‌లు ఉన్న నేప‌థ్యంలో ఇప్పుడు ఎంత ఉత్సాహంగా ముందుకు వ‌చ్చా రో.. ఎంత ఉత్సాహంతో బ‌య‌ట‌కు వ‌చ్చారో.. అంతే ఉత్సాహంతో నాయ‌కులు.. పార్టీ కార్య‌క్ర‌మాల విష‌యంలోనూ బ‌య‌ట‌కు రావాల‌నేది.. టీడీపీ సానుభూతి ప‌రుల మాట‌. అప్పుడే పార్టీ బ‌తికి బ‌ట్ట‌క‌డుతుంద‌ని.. వీక్‌నెస్‌ను వ‌దిలించుకోవాల‌ని సూచిస్తున్నారు.