Begin typing your search above and press return to search.
కోడెలపై కేసులు.. ట్విస్ట్ ఇదే..
By: Tupaki Desk | 13 Jun 2019 10:09 AM GMTటీడీపీ హయాంలో వెలుగు వెలిగిన మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ఇప్పుడు చిక్కుల్లో పడ్డారు. వైసీపీ గద్దెనెక్కాక ఆయనపై ‘కే ట్యాక్స్ ’ పేరిట భారీగా లంచాలు వసూలు చేశాడని కేసులు నమోదయ్యాయి. అయితే వైసీపీ తనపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆయన తాజాగా మీడియా ముందుకు వచ్చి ఆరోపించారు.
అయితే కేట్యాక్స్ పేరిట వసూళ్ల బాగోతం విషయంలో స్వయంగా ఆయనపై సొంత పార్టీ అయిన టీడీపీ నేతలు, నాయకులే కేసులు పెట్టారన్న విషయం తాజాగా బయటపడింది. కోడెల శివప్రసాద్ స్పీకర్ గా ఉన్న సమయంలో ఆయన కుమారుడు సత్తెనపల్లి, నరసారావు పేట నియోజకవర్గాల్లో పక్షులకు దానా నుంచి మైదానాల్లో గేమ్స్ ల వరకూ కేట్యాక్స్ పేరిట లంచాలు వసూలు చేశారని తాజాగా నరసారావు పేట వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి సంచలన ఆరోపనలు చేశారు. అంతేకాదు.. కేసులు పెట్టిన 11 మంది బాధితులు టీడీపీ వారేనని.. మీడియా వస్తే చూపిస్తానని ఆయన సవాల్ విసిరారు.
కే ట్యాక్స్ పేరిట వసూలు చేసిన కోడెలపై టీడీపీ ప్రభుత్వం హయాంలో పోలీసులకు చెప్పినా పట్టించుకోలేదని.. అందుకే ఇప్పుడు ప్రభుత్వం మారగానే టీడీపీ నాయకులే వచ్చిన ఫిర్యాదు చేస్తున్నారని నరసారావు పేట వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు.
ఇలా కేట్యాక్స్ దుమారంలో కోడెల టీడీపీ నేతలను కూడా వదలకుండా వసూళ్లు చేశారని అర్థమవుతోంది. అందుకే తాజా కేసులు టీడీపీ నాయకులే పెట్టారని చెప్పడంతో కోడెల ఇరుక్కుపోయినట్టు అయ్యింది. కేట్యాక్స్ పేరిట వసూళ్లు నిజమని తేటతెల్లమవుతోందంటున్నారు.