Begin typing your search above and press return to search.

జిల్లాల ప‌ర్య‌ట‌న‌ల్లో బాబు తేల్చింది ఇదేన‌ట‌..  

By:  Tupaki Desk   |   15 Dec 2022 11:30 PM GMT
జిల్లాల ప‌ర్య‌ట‌న‌ల్లో బాబు తేల్చింది ఇదేన‌ట‌..  
X
టీడీపీ అధినేత చంద్ర‌బాబు త‌ర‌చుగా జిల్లాల్లో ప‌ర్య‌టిస్తున్నారు. ఇప్ప‌టికి రాష్ట్రంలోని పాత 13 జిల్లాల్లో 6 జిల్లాల‌ను చంద్ర‌బాబు సుడిగాలి ప‌ర్య‌ట‌న మాదిరిగా చుట్టి వ‌చ్చారు. రోడ్ షోలు చేశారు. బ‌హిరంగ స‌భ‌లు నిర్వ‌హించారు. క‌ర్నూలు, కృష్ణా, గుంటూరు, ప‌శ్చిమ, తూర్పు గోదావరి జిల్లాల్లో ప‌ర్య‌టించిన చంద్ర‌బాబుక క‌ర్నూలులో ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు. అయితే.. ఇత‌ర జిల్లాల్లోనూ ఆశించిన మేర‌కు స్పందించిన ల‌భించినా.. ఇంకా స్పంద‌న రావాల‌నేది బాబు వ్యూహం.

స‌రే.. ఇప్ప‌టి వ‌ర‌కు చంద్ర‌బాబు చేసిన ప‌ర్య‌ట‌న‌లు.. ఇక్క‌డ గుర్తించిన అంశాల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసు కుంటే.. ఆయ‌న తేల్చింది ఏంటి. త‌మ్ముళ్ల‌కు చెప్పింది ఏంటి? అనే చ‌ర్చ జోరుగా సాగుతోంది. ఈ విష‌యాల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటే.. ప్ర‌భుత్వ ప్ర‌జావ్య‌తిరేక విధానాల‌ను నిర‌సిస్తున్న వారు ఉన్న‌ప్ప‌టికీ.. ప్ర‌జ‌ల‌ను త‌మ‌వైపు తిప్పుకోవ‌డంలో నాయ‌కులు విఫ‌ల‌మ‌వుతున్నారు.

ముఖ్యంగా చంద్ర‌బాబు ఇమేజ్‌ను న‌మ్ముకుంటున్న నాయ‌కులే క‌నిపిస్తున్నారు త‌ప్ప‌.. తమంత‌ట తాము పార్టీ ప‌రంగా ఏమీ సాధించ‌లేక పోతున్నార‌నేది చంద్ర‌బాబు గుర్తించారు. ఆయ‌న గ‌తం నుంచి కూడా ఇదే విష‌యాన్ని చెబుతున్నారు. మీ ఇమేజ్ పెంచుకునే ప్ర‌య‌త్నం చేయాల‌ని, ప్ర‌జ‌ల మ‌ధ్య ఉండాల‌ని ప‌దేప‌దే చెబుతున్నారు. అయిన‌ప్ప‌టికీ.. కొంద‌రు నాయ‌కులు వింటున్నారు. ఎక్కువ మంది మాత్రం పెడ‌చెవిన పెడుతున్నారు. దీంతో పార్టీకి ఇబ్బందులు వ‌స్తున్నాయి.

తాజాగా అనంత‌పురం, కృష్ణా, గుంటూరు, ఉభ‌య‌గోదావ‌రి జిల్లాల నాయ‌కుల‌తో మ‌రోసారి చంద్ర‌బాబు చ‌ర్చించారు. త‌ప్పు ప్ర‌జ‌ల్లో లేద‌ని, పార్టీ నేత‌ల్లోనే ఉంద‌ని కుండ‌బ‌ద్ద‌లు కొట్టారు. పార్టీత‌ర‌ఫున కార్య‌క్ర‌మాలు మ‌రింత ముమ్మ‌రం చేయాల‌ని మ‌రోసారి చెప్పారు. బ‌య‌ట‌కు రాకుండా.. కేవ‌లం మీడియా ముందుకు నాలుగు మాట‌లు అనేసి ఊరుకుంటే స‌రిపోద‌ని మ‌రోసారి వార్నింగ్ ఇచ్చారు. మ‌రి ఎంత మంది పాటిస్తారో చూడాలి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.