Begin typing your search above and press return to search.
యుద్ధంలో మేం కోల్పోయింది ఇదే.. వీడియో షేర్ చేసిన జెలెన్ స్కీ
By: Tupaki Desk | 18 March 2022 3:30 PM GMTఉక్రెయిన్ పై రష్యా చేస్తున్న సైనిక చర్య ఇప్పటికే చాలా విధ్వంసాన్ని సృష్టించించింది. అనేక నగరాల్లో ప్రజలు బాంబు దాడులు క్షిపణి దాడులు ఎప్పుడు జరుగుతాయో అని బిక్కు బిక్కు మంటూ జీవనం సాగిస్తున్నారు. ఇప్పటి వరకు జరిగిన దాడుల్లో ఉక్రెయిన్ లోని చాలా ప్రాంతాల ధ్వంసం అయ్యాయి. దీంతో నగరాల్లో ఉండేందుకు ప్రజలు చాలా భయపడుతున్నారు.
రష్యా సైనిక చర్య ప్రారంభించిన నాటి నుంచి చాలా మంది ప్రజలు వివిధ సరిహద్దు దేశాలకు తరలి వెళ్లారు. ఒకరు కాదు ఇద్దరు కాదు.. కొన్ని లక్షల మంది ప్రజలు సరిహద్దులు దాటి ఇతర దేశాల్లో తల దాచుకుంటున్నారు. మరి కొందరు బతికిన చచ్చినా నా దేశంలోనే అంటూ ఉక్రెయిన్ లోనే ఉంటున్నారు.
ఇదిలా ఉంటే రష్యా ఇప్పటి వరకు సైనిక చర్యను మాత్రమే ప్రారంభించింది అనుకుంటే పొరపాటే. ఇది పూర్తి స్థాయిలో యుద్ధం అని అందరూ అంటున్నారు. ఇందుకు సాక్ష్యాలుగా రష్యా దాడుల్లో శిధిలమైన నగరాలను చూపిస్తున్నారు. వీటిలో అనేక మంది అమాయకులు అయిన ప్రజలు , సైనికులు చనిపోయినట్లు కనిపించే వీడియోలను, ఫోటోలను షేర్ చేస్తున్నారు. వాటి రష్యా చేసిన విధ్వంసం స్పష్టంగా కనిపిస్తుంది.
ఎన్నో ప్రాంతాల్లో మృతదేహాలు కుప్పలు తెప్పలుగా పడి ఉన్నాయి. ఈ శవాల దిబ్బలు చూసిన ప్రజలు భయపడుతూ బతుకుతున్నారు.అయితే రష్యా చేపట్టిన ఈ సైనిక చర్య కారణంగా తమ దేశం ఎంత నష్టపోయిందో అని తెలియజేసే ఓ వీడియోను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో విడుదల చేశారు.
ఈ వీడియో లో రష్యా చేస్తున్న యుద్ధం లో యుద్ధంలో ప్రజలు ఎలా సమిధలు అయ్యారు అనేది స్పష్టంగా తెలుస్తోంది. అంతేగాకుండా యుద్ధానికి ముందు ఎలాంటి పరిస్థితి ఉండేది యుద్ధం తరువాత ఎలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి అనేది చాలా స్పష్టంగా వివరిస్తోంది. ఈ వీడియో చూసిన చాలా మంది అయ్యో ఉక్రెయిన్ ఇంత నష్టపోయిందా అని అనుకునేలా ఈ వీడియోను రూపొందిచారు. ఆనాడు దేశంలో ఉన్న పసి పిల్లల బోసి నవ్వులు మాయం అయ్యాయి అని చెప్పే వీడియో ను జెలెన్ స్కీ షేర్ చేశారు.
జెలెన్ స్కీ షేర్ చేసిన వీడియో ప్రస్తుతం ఉక్రెయిన్ లో ఉండే అత్యంత భయానక పరిస్థితి కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది చెప్తున్నారు. పుతిన్ సేనలు చేసిన దాడుల్లో ఎన్నో భవనాలు కూలిపోయాయి. మరి కొన్ని బూడిద అయ్యాయి. ఆఖరికి కొన్ని ప్రధాన నగరాల్లో ఉండే ఆసుపత్రులు ఎలా దెబ్బతిన్నది... రోగులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఇలా ఒకటి రెండు అని కాకుండా క్షేత్రస్థాయిలో అసలైన నివేదికను తెలిపేలా ఆ వీడియో ఉంది.
ఇదే వీడియో లో చిన్న చిన్న పసికందులను ఎత్తుకొని ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ఉక్రెయిన్ తల్లులు సరిహద్దులు దాటిన చిత్రాలు కూడా ఉన్నాయి. యుద్ధంలో వీరమరణం పొందిన సైనికులతో పాటు దాడుల్లో ప్రాణాలు పోగొట్టుకున్న వారి సామూహిక ఖననం చేసే లాంటి అత్యంత హృదయ విషాధారక దృశ్యాలు ఉన్నాయి.
ఈ వీడియో చూసిన చాలా మంది రష్యా చేసిన సైనిక దాడులు ఇంత భయంకరంగా ఉన్నాయా అని అంటున్నారు. మానవతా హృదయంతో ఉక్రెయిన్ కు సహాయంగా నిలబడాలి అని చెప్తున్నారు. ఇదిలా ఉంటే గురువారం జరిగిన దాడుల్లో రష్యాకు చెందిన ఓ సినీ నటి మరణించింది. నివాస స్థలం పై జరిగిన క్షిపణి దాడిలో ఈమె చనిపోయినట్లు అధికారులు తెలిపారు.