Begin typing your search above and press return to search.

అర్జంట్ గా వాట్సాప్ వినియోగదారులు తెలుసుకోవాల్సింది ఇదే

By:  Tupaki Desk   |   19 Aug 2021 12:30 PM GMT
అర్జంట్ గా వాట్సాప్ వినియోగదారులు తెలుసుకోవాల్సింది ఇదే
X
వాట్సాప్ ను కూడా కేటుగాళ్లు హ్యాక్ చేస్తున్నారు. ఫ్రెండ్స్ పేరుతో లింక్స్ పంపిస్తున్నారు. క్లిక్ చేశారో అంతే సంగతులు.. మీ డబ్బులకు ఎసరు పెడుతారు. కాంటాక్ట్ లిస్టులో నెంబర్లకు డబ్బులు కావాలంటూ మెసేజ్ లు పంపి సొమ్ములు కాజేస్తున్నారు. ఇలా లక్షలు మోసపోయిన బాధితుల లిస్ట్ భారీగా ఉంటోంది.

తాజాగా హైదరాబాద్ సైబర్ క్రైమ్ కు వస్తున్న ఫిర్యాదులు అన్నీ కూడా ఈ వాట్సాప్ హ్యాక్ కు సంబంధించినవే కావడం గమనార్హం. తనకు అర్జెంట్ గా డబ్బులు కావాలని.. ఎంతుంటే అంత వెంటనే తన అకౌంట్ కు ట్రాన్స్ ఫర్ చేయాలని అందులో ఉంటుంది. అది నమ్మశక్యంగా లేదని కొందరు ఉద్యోగులు ఎండీ దృష్టికి తీసుకెళ్లారు.తాను ఆ మెసేజ్ లు పంపలేదని ఆ ఎండీ చెప్పగా ఉద్యోగులంతా షాక్ అయ్యారు.

అసలు విషయం ఏంటంటే ఆ ఎండీ వాట్సాప్ అకౌంట్ ను కేటుగాళ్లు హ్యాక్ చేసినట్టు స్పష్టమైంది. వెంటనే వారు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.బుధవారం ఏకంగా రెండు ఫిర్యాదులు అందాయి.

షేక్ పేటకు చెందిన యువతి సోదరుడు సౌదీలో ఉంటున్నాడు. అతడి వాట్సాప్ నుంచి ఆమెకు రెండు రోజుల క్రితం మెసేజ్ రాగా అకౌంట్ నెంబర్ కు ఆమె ఏకంగా రూ.1.50లక్షలు పంపింది. అనంతరం సోదరుడికి ఫోన్ చేసి డబ్బులు వచ్చాయా? అని అడిగింది. ఆ మెసేజ్ తాను పంపలేదని అనడంతో మోసపోయామని.. వాట్సాప్ అకౌంట్ హ్యాక్ అయ్యిందని గుర్తించారు. బ్యాంక్ అకౌంట్ నంబర్ కూడా తనది కాదని అనడంతో మోసపోయామని గ్రహించి సైబర్ క్రైంకు ఫిర్యాదు చేశారు.

ఇదే తరహాలో తన స్నేహితుడి నుంచి కూడా వాట్సాప్ మెసేజ్ రావడంతో లక్షన్నర పంపించినట్లు మారేడు పల్లికి చెందిన మరో యువకుడు కూడా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఒక లింక్ ద్వారా వాట్సాప్ అకౌంట్ ను హ్యాక్ చేస్తున్న కేటుగాళ్లు డబ్బులు కావాలంటూ ఆ అకౌంట్ లో ఉన్న కాంటాక్ట్ నంబర్లకు మెసేజ్ లు పంపుతున్నారు. ఈ కొత్త తరహా మోసంపై అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైం పోలీసులు చెబుతున్నారు.