Begin typing your search above and press return to search.
బిడ్డకు పేరుపెట్టేందుకు..ఎన్నికలు నిర్వహించారు
By: Tupaki Desk | 20 Jun 2018 1:30 PM GMTసాధారణంగా ఎన్నికలు ఎందుకోసం నిర్వహిస్తారు? పార్లమెంట్ - శాసనసభ - గ్రామపంచాయతీలకు ప్రజాప్రతినిధులను ఎన్నుకోవడం కోసం. ఉన్న ప్రత్యామ్నాయాల్లోంచి సరైన వ్యక్తికి తమ నాయకుడిగా అవకాశం ఇచ్చేందుకు. అయితే ఇలా ఎన్నికల ద్వారా ప్రజాప్రతినిధులను ఎన్నుకునే విధానానికి భిన్నంగా ఓ ఇద్దరు దంపతులు మాత్రం తమకు పుట్టిన బిడ్డకు పేరును ఖరారు చేసేందుకు ఎన్నికలు నిర్వహించారు! ఇదేం చిత్రం అని ఆశ్చర్యపోకండి...అసలు లాజిక్ తెలిస్తే..ఇంకా ఆశ్చర్యపోతారు.
వివరాల్లోకి వెళితే...గొండియాకు చెందిన మిథున్ - మాన్షీ బాంగ్ దంపతులకు ఇటీవలే పండంటి మగబిడ్డ జన్మించాడు. తమకు పుట్టిన బిడ్డ భవిష్యత్ లో గొప్ప రాజకీయ నాయకుడు అవుతాడని జ్యోతిష్యులు చెప్పారట. దీంతో ఆ బిడ్డ పేరు ప్రత్యేకంగా ఉండాలని.. ప్రజలకు నచ్చే విధంగా ఉండాలనే సంకల్పంతో చిన్నారి తల్లిదండ్రులు ఎన్నికల ప్రక్రియ నిర్వహించారు. మూడు పేర్లతో బ్యాలెట్ పేపర్లను అచ్చు వేయించారు. ఎన్నికలు ఎలా జరుగుతాయే అదే రీతిలో జూన్ 15న తమ నివాసంలో పోలింగ్ నిర్వహించారు. ఈ ఎన్నికల ప్రక్రియలో బంధువులు - సన్నిహితులు పాల్గొన్నారు. యక్ష, యోవిక్, యువన్ పేర్లను ప్రతిపాదించగా.. యువన్‌కే అత్యధికంగా ఓట్లు పడ్డాయి. దీంతో ఆ బిడ్డ పేరును యువన్‌గా తల్లిదండ్రులు నామకరణం చేశారు. ఇదండి పేరు పెట్టేందుకు ఎన్నికలు నిర్వహించిన తల్లిదండ్రుల సంగతి.