Begin typing your search above and press return to search.
అవును అతని శరీరం.. ఒక లిక్కర్ ఫ్యాక్టరీ!
By: Tupaki Desk | 27 Oct 2019 5:02 AM GMTమందు కొట్టే వారిలో కొందరు మద్యాన్ని ఎంతలా ప్రేమిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే ఉండదు. ఉదయాన్నే బెడ్ కాఫీ.. టీ మాదిరి డ్రింక్ చేసేవారు కొందరుంటారు. ఇలాంటి వారి సంగతి ఎలా ఉన్నా.. మద్యం విషయంలో పెద్ద ఆసక్తి లేని వారికి.. అదంటేనే పడని వారికి ఈ వార్త నిజంగానే షాకింగ్ మారుతుంది. దేవుడా.. మాకు మాత్రం ఇలాంటి పరిస్థితి రాకుండా చూసుకో అని ప్రార్థించటం ఖాయం. ఇంతకీ విషయం ఏమంటే.. ఒక వ్యక్తిని డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఆల్కహాల్ టెస్ట్ చేశారు.
అతని శరీరంలో ఉండాల్సిన స్థాయి కంటే ఎక్కువ ఆల్కహాల్ శాతం ఉన్నట్లు గుర్తించారు. ఆ వెంటనే.. మన దగ్గరి మాదిరి డ్రంకెన్ డ్రైవ్ కేసు వేసి కోర్టుకు తరలించారు. ఇదంతా న్యూయార్క్ లో చోటు చేసుకుంది. ఇక్కడే అసలు ట్విస్ట్ స్టార్ట్ అయ్యింది. కోర్టుకు తీసుకెళ్లిన ఆ వ్యక్తి తరఫున బంధువు ఒకరు ఎంట్రీ ఇచ్చి.. కోర్టు సైతం ఆశ్చర్యపోయే విషయాలు చెప్పి అందరిని అవాక్కు అయ్యేలా చేశారు
తీసుకునే ఫుడ్ లో పిండి పదార్థాల్ని గ్లూకోజ్ గా కాకుండా.. ఆల్కహాల్ గా మార్చే ప్రత్యేక సూక్ష్మజీవి కొందరి కడుపులో ఉంటుందట. ఈ కారణంతో పిండి పదార్థాలు ఎక్కువగా ఉన్న ఫుడ్ తిన్న వారు.. మద్యం సేవించినట్లు వాసన రావటమే కాదు.. వారి రక్తంలో లిక్కర్ కంటెంట్ ఉన్నట్లు తేలుతుంది. ఒక రకంగా సదరు వ్యక్తి శరీరం లిక్కర్ ఫ్యాక్టరీగా చెప్పాలి. న్యూయార్క్ లో డ్రైవ్ చేస్తూ మద్యం తాగినట్లుగా పోలీసులకు పట్టుబడిన వ్యక్తికి ఇలాంటి పరిస్థితే ఉందట.
సినిమాటిక్ గా ఉన్న ఈ ఉదంతాన్ని కోర్టు వెంటనే నమ్మలేదు. నిపుణుల మధ్య పరీక్షలు నిర్వహించారు. పిండిపదార్థాలు ఎక్కువగా తిన్న తర్వాత రక్తాన్ని టెస్ట్ చేయగా.. సదరు నిందితుడి తరఫు సాయం చేసిన వ్యక్తి వాదన నిజమని తేలింది. దీంతో.. అతగాడిని నిర్దోషిగా కోర్టు ప్రకటించింది. ఇదంతా బాగానే ఉన్నా.. ఇలాంటి బ్యాక్టీరియా.. లిక్కర్ అంటే పడని వ్యక్తి కడుపులో చేరితే పరిస్థితి ఏమిటంటారు?