Begin typing your search above and press return to search.
ఇలాంటి గిప్ట్ మీ లవ్వర్ ఇస్తే ఎలా ఫీల్ అవుతారు?
By: Tupaki Desk | 28 Oct 2019 4:47 AM GMTప్రియురాలు వచ్చే వరకూ ఒక టెన్షన్.. వచ్చిన తర్వాత మరో టెన్షన్. మనసుకు నచ్చిన లవ్వర్ మనసు దోచేందుకు ఒక్కొక్కరు ఒక్కోలా తమ ప్రేమను ప్రదర్శిస్తుంటారు. అందమైన బహుమతులతో కొందరు ఇంప్రెస్ చేస్తే.. మరికొందరు ఖరీదైన బహుమతులతో మనసు దోచేయాలనుకుంటారు. ఇంకొందరు మాత్రం ఈ ఇద్దరికి భిన్నమైన తీరు ఉంటుంది. వారు వినూత్నంగా తమ బహుమతులు ఉండాలని.. అదే పనిగా క్రియేటివిటీతో ఆలోచనలు చేస్తుంటారు.
తాజాగా అలాంటి ప్రయత్నమే చేసి.. అందరి కంట్లో పడ్డారు జపాన్ కు చెందిన ఒక వ్యక్తి. తన గర్ల్ ఫ్రెండ్ కు వినూత్నరీతిలో బహుమతి ఇవ్వాలని డిసైడ్ అయిన అతగాడు.. అందుకోసం విపరీతంగా ఆలోచించి.. చివరకు ఊహించని రీతిలో ఒక గిఫ్ట్ ను ప్లాన్ చేశాడు. అదేమంటే.. ఒక వెండి ఉంగరానికి బ్లాక్ స్టోన్ తో తయారుచేశారు. ఇదేమైనా పెద్ద బహుమతా? అని లైట్ తీసుకోవచ్చు కానీ.. ఈ ఉంగరం మామూలు రింగ్ కానే కాదు.
దీని ప్రత్యేకత ఏమంటే.. తన ప్రియురాలికి రేర్ బహుమతి ఇవ్వాలన్న ఉద్దేశంతో ఏడాది పాటు.. తన గోళ్లను ఎప్పటికప్పుడు కట్ చేసి.. భద్రంగా దాచేవాడు. అలా ఏడాది పాటు దాచిన గోళ్ల ముక్కల్ని మిక్సీ చేసి.. పొడి చేశాడు. తర్వాత ఆ పొడిని నీళ్లల్లో బాగా కలిపాడు. ఆ మిశ్రమాన్ని ఓవెన్ లో విపరీతంగా వేడి చేశాడు. దాన్ని చివరకు ఒక మోస్తరు పచ్చిశనగపప్పు సైజులో తీసుకొచ్చి.. దాన్ని జాగ్రత్తగా కట్ చేయించాడు. ఈ మొత్తం ప్రక్రియను ఎప్పటికప్పుడు వీడియో తీశాడు. వెండి ఉంగరానికి వజ్రం స్థానంలో ఈ నల్లటి గోరు ముద్దును తయారు చేశాడు.
ఈ చిత్రమైన రింగ్ తయారీకి సంబంధించిన వీడియో ఇప్పుడు వైలర్ గా మారింది. అయితే.. ఈ ప్రేమికుడి బహుమతికి నెటిజన్ల నుంచి రెస్పాన్స్ మాత్రం పాజిటివ్ గా లేదు. ఈ ఐడియా చాలామందిని ఏ మాత్రం ఆకట్టుకోలేదు. ఇబ్బందిగా ముఖం పెట్టేస్తున్నారు. ఇదేం తిక్క ఆలోచన అంటూ తిట్టే వారే కాదు.. అతగాడి ప్రియురాలు రోబో అయి ఉంటుందని తిట్టేవారు లేకపోలేదు. మరి.. అతగాడి ప్రియురాలి రెస్పాన్స్ ఏమిటన్నది బయటకు రాలేదు. ఇంతా చేస్తే.. వినూత్నంగా ఆలోచించి తయారు చేసిన ఈ రింగు.. సదరు కుర్రాడి గర్ల్ ఫ్రెండ్ కు ఫిట్ కాకపోవటం ఈ మొత్తం ఎపిసోడ్ కు కొసమెరుపుగా చెప్పాలి.