Begin typing your search above and press return to search.

వండర్: కరోనాకు ఈ కొత్త మందు పనిచేస్తోంది

By:  Tupaki Desk   |   18 April 2020 6:10 AM GMT
వండర్: కరోనాకు ఈ కొత్త మందు పనిచేస్తోంది
X
కరోనా వైరస్ చికిత్సలో భారత దేశం ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్న మలేరియా నివారణ మందు ‘హైడ్రాక్సీ క్లోర్లో క్విన్’ బాగా పనిచేస్తోందని ఇప్పటివరకూ అందరూ ఇదే మందును వినియోగిస్తున్నారు. ఇప్పటికే ఈ మందు కావాలని అమెరికా.. ఇటీవలే భారత్ ను అభ్యర్థించింది. భారత్ మానవతా దృక్పథంతో అమెరికాకు ఈ మందును పంపిణీ చేసింది.

ఇప్పటికీ కరోనా రోగులకు చాలా మంది వైద్యులు ఈ మందునే వాడుతున్నారు. హైడ్రాక్సీ క్లోర్లోక్విన్ తోనే కరోనాను కంట్రోల్ చేస్తున్నారు. అయితే కరోనాను పూర్తిగా కంట్రోల్ చేసే మందు ఇదేనని ఆమోదించడానికి వైద్యశాస్త్రం నిరాకరిస్తోంది.

తాజాగా ప్రయోగాల్లో మరో కొత్త మందు ‘కరోనా’పై బాగా పని చేస్తోందని తేలింది. ప్రయోగాత్మక పరీక్షల్లో ఈ డ్రగ్ కరోనాను ఖతం చేయడం విశేషంగా మారింది. వైద్యశాస్త్రానికి కొత్త ఊపిరిలూదింది.

‘రెమెడిసివిర్’ అనే ఈ డ్రగ్ కరోనా చికిత్సలో అద్భుతంగా పనిచేస్తున్నట్టు తేలింది. తాజా క్లినికల్ ట్రయల్స్ లో కరోనా రోగులకు ఈ మందును వాడారు. తీవ్రమైన శ్వాసకోశ ఇబ్బందులు, జ్వరం ఉండి మరణానికి దగ్గరైన వారు.. చికిత్సకు స్పందించని వారిపై ఈ మందును ప్రయోగించారు. వారు వారంలోపు కోలుకొని కరోనా పూర్తిగా తగ్గి ఆస్పత్రి నుంచి డిశ్చార్జి కావడం సంచలనంగా మారింది.

నిజానికి ‘కరోనావైరస్’కు నివారణ మందు లేకపోవడంతో ప్రపంచ వ్యాప్తంగా చాలా మందులను వైద్యులు ఉపయోగిస్తున్నారు. కానీ అన్నింటిలోకి ‘రెమెడిసివిర్’ మందు బాగా పని చేస్తోందని వైద్యులు తేల్చారు.

గిలియడ్ సైన్సెస్ ఈ ‘రెమెడిసివిర్’ మందును తయారు చేశారు. దీన్ని మొదట ‘ఎబోలా’ చికిత్స కోసం తయారు చేశారు. అయితే ఎబోలాను అరికట్టడంలో ఈ మందు అంతగా విజయవంతం కాలేదు. ఇక సార్స్ సోకిన జంతువులపై ‘రెమెడిసివిర్’ మందును ప్రయోగించగా సత్ఫలితాలు ఇచ్చింది. దీంతో కరోనా వైరస్ పై వాడగా అద్భుతంగా పనిచేసింది. దీంతో ఇప్పుడు కరోనా చికిత్సకు ఈ ‘రెమెడిసివిర్’ బెటర్ అని వైద్యులు సూచిస్తున్నారు. ప్రస్తుతం క్లినికల్ ట్రయల్స్ లో ఉన్న ఈ మందును ప్రపంచ వ్యాప్తంగా 152 ట్రయల్స్ సైట్ లలో 2400 కరోనా రోగులకు ఇచ్చారు. ఈ ట్రయల్ ఫలితాలు ఈ నెలాఖరులోపు వస్తాయి. విజయవంతమైతే కరోనాకు మనకు మందు దొరికినట్టే.