Begin typing your search above and press return to search.
పరకాల చేతి లోకి ఈ న్యూస్ చానెల్
By: Tupaki Desk | 16 Nov 2019 5:02 AM GMTపరకాల ప్రభాకర్.. 2014లో చంద్రబాబు గద్దెనెక్క గానే ఈయన ను ఏపీ ప్రభుత్వ కమ్యూనికేషన్ సలహాదారు గా పెట్టుకున్నారు. పరకాల భార్య నిర్మల కేంద్ర మంత్రిగా ఉండడం తో కేంద్రం తో దోస్తీ నేపథ్యం లో నిధుల కోసం ఈయనను ఉపయోగించుకున్నారు. కానీ ఆ తర్వాత బీజేపీ తో చెడడం తో పరకాలను పక్కన పెట్టేశారు.
ఆదినుంచి పరకాల ప్రభాకర్ ఫైర్ బ్రాండ్ గా రాజకీయాల్లో ఉన్నాడు. ఈటీవీ ప్రతి ధ్వనిలో వ్యాఖ్యాత గా మొదలైన ఈయన ప్రస్థానం అనంతరం బీజేపీ లోకి రాజకీయ నేతగా అడుగు పెట్టారు. ఆ తర్వాత చిరంజీవి ప్రజారాజ్యం లో చేరి ఆ పార్టీ పై దారుణ విమర్శలు చేసి వార్తల్లో నిలిచారు. అనంతరం చంద్రబాబు టీడీపీలో చేరారు. ఆయన దూరం పెట్టడంతో ఇప్పుడు ఖాళీగా ఉంటున్నారు.
ఇటీవల తన భార్య కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా ప్రవేశ పెట్టిన ఆర్థిక బడ్జెట్ పై పరకాల సంచలన ఆరోపణలు బీజేపీ ని ఇబ్బంది పెట్టాయి. అయితే ఆ తరువాత సర్దుకున్న పరకాల ఇప్పుడు మౌనంగా ఉంటున్నారు. ఈయనను ఖాళీగా ఉంచడం కన్నా బీజేపీ కి వాడుకోవాలని కమల దళం భావించినట్టుంది.
మహా టీవీని కొన్న బీజేపీ లో చేరిన ఎంపీ సుజనా చౌదరి ఇప్పుడు దాని రూపురేఖలు మార్చి తిరిగి కొత్తగా లాంచ్ చేయడానికి రెడీ అయ్యారు. దాని పూర్తి బాధ్యతలను పరకాల ప్రభాకర్ కు అప్పగించినట్టు తెలిసింది. ఆయన ప్రస్తుతం మహాటీవీకి కోసం ట్యూన్స్ కోసం సంగీత దర్శకుడు కళ్యాణీ మాలిక్ తో మ్యూజిక్ కంపోజిషన్స్ చేపట్టారు. అంతేకాదు.. తన ఇంట్లో సీనియర్ జర్నలిస్టుల కోసం ఇంటర్వ్యూలు కండక్ట్ చేశారట..
ఇలా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల భర్తకు చేతినిండా పనికల్పించాడు అదే పార్టీకి చెందిన బీజేపీ ఎంపీ సుజనాచౌదరి. ఆమెను ప్రసన్నం చేసుకుంటే తనకూ కొంత మేలు జరుగుతుందనే ఈ ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఒక మీడియాను బీజేపీకి అనుకూలంగా మార్చడానికి పూనుకున్నారు. మరి పరకాల వివాదాలతో దాన్ని పాపులర్ చేస్తాడో లేక పట్టాలెక్కిస్తాడన్నది వేచిచూడాలి.