Begin typing your search above and press return to search.
భారత్-పాక్ మధ్య మ్యాచ్ లో ఈ జంట సో స్పెషల్!
By: Tupaki Desk | 17 Jun 2019 10:17 AM GMTఅంతా ఎంతో ఆశగా ఎదురుచూసిన మ్యాచ్ పూర్తైంది. సెంటిమెంట్ కు తగ్గట్లే భారత్ ఈ మ్యాచ్ లో గెలిచింది. కోహ్లీ సేన సాధించిన విజయంతో భారతీయులు పండుగ చేసుకుంటుంటే.. పాకిస్తానీయులు మాత్రం అందుకు భిన్నంగా తీవ్ర వేదనలో మునిగిపోయారు. తమ జట్టు ఓటమిని అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్ కు హాజరైన ఒక జంట మాత్రం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షించటమే కాదు.. ఇప్పుడు హాట్ టాపిక్ గా మారారు.
ఇంతకీ వారెందుకంత స్పెషల్ గా నిలిచారన్నది చూస్తే.. ఈ జంట చిత్రమైన జెర్సీని ధరించారు. సగం ఇండియా.. సగం పాక్ చెందిన జెర్సీలను ప్రత్యేకంగా తయారు చేయించుకొని మరీ ధరించారు. ఇంతకూ వారెవరు? ఎందుకీ పని చేశారన్న విషయాన్ని ఆ మ్యాచ్ లో పాల్గొన్న ఒకరు సోషల్ మీడియాలో తెలియజేశారు.
ఆ జంటలో భర్తది పాకిస్తాన్ అని.. భార్యది భారత్ అని.. వారిద్దరూ కెనడాలో నివసిస్తుంటారని పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య జరిగే మ్యాచ్ ను యుద్ధంగా భావించే తీరుకు భిన్నంగా వీరిద్దరు మాత్రం రెండు దేశాల జెర్సీని కలిపి కుట్టించి ఎంజాయ్ చేయటం చూపురులను ఆకట్టుకుంది. క్రికెట్ స్ఫూర్తిని తెలియజేస్తూ శాంతికి చిహ్నంగా నిలిచిన వీరు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారారు.
వీరి సంబంధించిన సమాచారానికి పలువురు నెటిజన్లు రియాక్ట్ అవుతున్నారు. రెండు దేశాల మధ్య జరుగుతున్నది కేవలం ఆటేనని.. ఆ విషయాన్ని వారిద్దరూ కలిసి మనకు గట్టిగా చెప్పారని కామెంట్ చేయగా.. మరొకరు ఇద్దరి మధ్య ఎంత ప్రేమనో అని అభిప్రాయపడ్డారు. మరొకరు ఈ జంట మీద రియాక్ట్ అవుతూ.. నిన్న ఎవరు గెలిచారన్నది అనవసరం.. కానీ వీరు చేసిన పని మనమంతా ఒక్కటేనన్న ఫీలింగ్ కలిగిస్తోందంటూ వ్యాఖ్యానించారు. ఏమైనా ఈ జంట ఈ మ్యాచ్ కే సో స్పెషల్ గా నిలిచారనటంలో సందేహం లేదు.