Begin typing your search above and press return to search.

ఈసారి జిమ్ ట్రైనర్.. కూర్చున్న చోటునే ప్రాణాలు విడిచారు

By:  Tupaki Desk   |   20 Oct 2022 4:24 AM GMT
ఈసారి జిమ్ ట్రైనర్.. కూర్చున్న చోటునే ప్రాణాలు విడిచారు
X
ఒకప్పుడు గుండెపోటు ఒక వయసు దాటిన వారికే వచ్చేది. కరోనా తర్వాత నుంచి మాత్రం పరిస్థితుల్లో మార్పు వచ్చింది. యువకులు.. మధ్యవయస్కులకు సడన్ గా గుండెపోటు రావటం.. చూస్తుండగానే ప్రాణాలు విడిచిన ఉదంతాలు అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయి.

ఈ ఆకస్మిక గుండెపోటుతో పలువురు ప్రముఖులు ఇప్పటికే ప్రాణాలు విడిచిన వైనం తెలిసిందే. ఇటీవల కాలంలో పలువురు తాము చేస్తున్న పనిని చేస్తూనే ప్రాణాలు విడిచేయటం.. వాటికి సంబంధించిన వీడియోలు వైరల్ గా మారుతున్నాయి. తాజాగా యూపీలోని గజియాబాద్ లో ఇలాంటి విషాద ఉదంతమే చోటు చేసుకుంది.

ఒక యువకుడైన జిమ్ ట్రైనర్ ఆదిల్.. తన జిమ్ కార్యాలయంలో కుర్చీలో కూర్చొని ఉన్నారు. ఉన్నట్లుండి కుర్చీలో చేరగిలిపోవటం.. ఆ వెంటనే ప్రాణాలు విడిచి ఉదంతం ఇప్పుడు షాకింగ్ గా మారింది. ఆదివారం రాత్రి ఏడు గంటల ప్రాంతంలో చోటు చేసుకున్న ఈ ఉదంతానికి సంబంధించిన వీడియో ఫుటేజ్ ఇప్పుడు సోషల్ మీడియాలో హడావుడి చేస్తోంది. అప్పటివరకు బాగానే ఉండి.. అందరితో మాట్లాడుతూ పని చేస్తున్న జిమ్ ట్రైనర్ కుర్చీలో కూర్చొని ఒక్కసారిగా ప్రాణాలు విడిచారు.

గజియాబాద్ లోని షాలిమార్ ప్రాంతంలో సొంతంగా జిమ్ నిర్వహిస్తున్న అతడు.. రోజూ వ్యాయామాన్ని అక్కడే చేస్తుంటారని చెబుతున్నారు. కొన్ని రోజులుగా జ్వరంతో ఉన్నప్పటికీ జిమ్ కు రావటం మాత్రం ఆపలేదంటున్నారు. ఈ మధ్యనే రియల్ ఎస్టేట్ బిజినెస్ లోకి దిగిన అతను తన ఆఫీసును షాలిమార్ ప్రాంతంలో ఓపెన్ చేసినట్లుగా చెబుతున్నారు.

అక్కడే పని చేసుకుంటూ ప్రాణాలు విడిచినట్లుగా చెబుతున్నారు. అతడికి భార్య.. నలుగురు పిల్లలు ఉన్నట్లుగా అధికారులు వెల్లడించారు. తాజా ఉదంతంతో అతడి కుటుంబంలో పెను విషాదం అలుముకుంది. ఫిట్ గా ఉండే జిమ్ ట్రైనర్ సైతం గుండెపోటుకు గురి కావటం.. అకస్మాత్తుగా ప్రాణాలు విడవటం షాకింగ్ గా మారింది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.