Begin typing your search above and press return to search.
ఈ సారి మోడీ.. వైసీపీ ఎంపీలకు పెద్దగా స్పందన ఇవ్వలేదా?
By: Tupaki Desk | 10 Dec 2021 3:44 AM GMTపై ఫొటో చూశారా? బలవంతపు నవ్వు.. అంతే బలవంతపు హావభావం! మోడీ ముఖంలో చూద్దామన్నా.. చిరు నవ్వు కనిపించలేదు. అది కూడా వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత.. వి. విజయసాయిరెడ్డితో కలిసిన ఫొటో. మరోవైపు.. సాయిరెడ్డి ముఖంలో.. చిరునవ్వులు చిందేస్తున్నాయి. కానీ.. పక్కనే ఉన్న మోడీ ముఖం మాత్రం చిట్లించుకునే కనిపిస్తోంది.-ఇప్పుడు ఈ ఫొటోలే.. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అంతేకాదు.. మోడీ.. ఈ దఫా.. వైసీపీ ఎంపీల విషయంలో పెద్దగా స్పందించలేదే! అనే కామెంట్లు కూడా పడుతున్నాయి.
ప్రధాని మోడీతో వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నాయకులు విజయసాయి రెడ్డి తాజాగా భేటీ అయ్యారు. ఏపీలోని పలు అంశాలపై చర్చించారు. ఏపీ విభజన చట్టంలోని పెండింగ్ అంశాలను మోడీ దృష్టికి విజయసాయి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ప్రస్తుత పార్లమెంట్ సమావేశాలలో ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి లేవెనెత్తిన పలు సమస్యలను ప్రధాని దృష్టికి తీసుకువచ్చారు. వాటి సత్వర పరిష్కారం కోసం కృషి చేయవలసిందిగా మోడీని కోరారు. వాటి పరిష్కారానికి ప్రధాని సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. అయితే.. ఈ సందర్భంగా ప్రధాని హావభావాలు చర్చకు దారితీశాయి.
వాస్తవానికి ఆదిలో .. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మోడీని ఎప్పుడు కలిసినా.. పక్కనే కూర్చుని ఆయనతో నవ్వుతూ.. మాట్లాడేవారు. మోడీ కూడా అంతే చిరుమందహాసంతో పలకరించేవారు. రాష్ట్ర సమస్యలు కానీ.. వ్యక్తిగతవిషయాలు కానీ.. ఏవైనా కూడా విజయసాయి చెబుతున్నంత సేపూ.. మోడీ ఓపికగా వినేవారు. అంతేకాదు..చిరునవ్వుతూనే తిరిగి పంపేవారు. దీనికి కారణం.. రాజ్యసభలోనూ.. బయట కూడా.. మోడీ విషయంలో వైసీపీ ఎంపీలు అనుసరిస్తున్న వైఖరే కారణమని.. అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే.. ఇప్పుడు ఎందుకో.. మోడీ.. ముఖం ముడుచుకున్నారనే భావన వ్యక్తమవుతోంది.
కొన్నాళ్లుగా.. ప్రత్యేక హోదా సహా.. పోలవరం నీటి ప్రాజెక్టు అంచెనాల పెంపు విషయంలో కేంద్రం తన వైఖరిని స్పష్టంగా చెబుతోంది. అయినప్పటికీ.. వైసీపీ ఎంపీలు మాత్రం సభలో కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. అదేసమయంలో మూడు సాగు చట్టాలకు రాజ్యసభలో ఆమోదం తెలిపిన వైసీపీ ఎంపీలు.. తర్వాత.. ఏపీలో రైతులు చేపట్టిన ఆందోళనకు మద్దతిచ్చారు.. ఇలా.. కొన్ని విషయాల్లో వ్యూహాత్మకంగా బీజేపీని ఇరుకున పెడుతున్నారు. బహుశ ఆయా విషయాలు మోడీ వరకు చేరి ఉంటాయని.. అంటున్నారు. అందుకే.. ఆయన గతానికి భిన్నంగా.. వైసీపీ ఎంపీలతో కలివిడిగా ఉండకపోయి ఉండొచ్చని అంటున్నారు పరిశీలకులు. ప్రస్తుతం ఈ ఫొటోలు.. సోషల్ మీడిలో వైరల్ అయ్యాయి.