Begin typing your search above and press return to search.

ఈసారి  ఎన్నికలు వేరే లెవెల్లో....జగన్.. బాబు..పవన్ అంచనా అదే...?

By:  Tupaki Desk   |   19 Dec 2022 3:58 AM GMT
ఈసారి  ఎన్నికలు వేరే లెవెల్లో....జగన్.. బాబు..పవన్ అంచనా అదే...?
X
ఏపీలో ఈసారి ఎన్నికలు మామూలుగా జరగవు అని జగన్ అంటున్నారు. అదే నిజమని చంద్రబాబూ చెబుతున్నారు. ఇక లేటెస్ట్ గా సత్తెనపల్లి మీటింగులో పవన్ అదే అనేశారు. ఈసారి హోరా హోరీ తప్పదు అని సేనాని 2024 యుద్ధం ఏ రేంజిలో ఉంటుందో అంచనా కట్టి మరీ చెప్పేశారు. నిజానికి చూస్తే ఏపీలోనే కాదు దేశంలో కూడా ఎన్నిక ఎన్నికకూ సీరియస్ నెస్ పెరుగుతుంది. ఆ తీవ్రత వేరే రేంజిలో ఉంటుంది.

ఎందుకంటే ప్రతీ అయిదేళ్లకు పరిస్థితులు మారుతాయి. అలాగే సాంకేతికత పరిస్థితులు, టెక్నాలజీ ఇలా చాలా మారిపోతాయి. దాంతో ఎత్తులు జిత్తులు అన్నీ కూడా వేరే లెవెల్ లో ఉంటాయి. అది సహజం. కానీ పోటీ మరీ బీభత్సంగా ఉన్నపుడు అటూ ఇటూ కూడా ఢీ అంటే ఢీ కొట్టినపుడు ఫలితం ఏంటో ముందే చెప్పలేనపుడు ఎన్నికలు ఇంకా వాడి వేడిగా జరుగుతాయి.

చివరి నిముషం వరకూ నాదే గెలుపు అన్నట్లుగానే ఎన్నికల యుద్ధం ఉంటుంది. ఏపీలో అయితే అయిదు కోట్ల ప్రజానీకం రెండుగా చీలిపోయారా అన్న పరిస్థితి కనిపిస్తోంది. ఒక మేజర్ సెక్షన్ అయితే అభివృద్ధి కోరుకుంటోంది. అంతే స్థాయిలో మరో సెక్షన్ సంక్షేమం కావాలంటోంది. ఇక కుల సమీకరణలు కూడా ఏపీలో ఎక్కువే కాబట్టి కులం ఓట్లు వెల్లువలా పొంగితే సిట్యువేషన్ మొత్తం మారుతుంది అన్నది కూడా ఉంది.

ఇలా ఎవరికి వారు వచ్చే ఎన్నికల మీద ఆశలు అంచనాలు పెట్టుకుని ఉన్నారు. జగన్ అయితే 175 కి 175 అంటున్నారు. క్యాడర్ ని ఉత్సాహపరుస్తున్నారు. కానీ ఎన్నికల రంగంలోకి దిగితే సీన్ అంత సులువు కాదని ఆయనకూ తెలుసు అంటున్నారు. అందుకే పదే పదే ఆయన పార్టీ వారిని హెచ్చరిస్తూ వస్తున్నారు. ఇక చంద్రబాబు తీరు కూడా అదే ఈసారి మాదే గెలుపు అని ఆయన గట్టిగా చెబుతున్నా ఎక్కడో ఏదో తెలియని గుబులు వెంటాడుతోంది.

దానికి కారణం 2019 ఎన్నికలు. నాడు కూడా ధీమాకు పోతే రిజల్ట్ దారుణంగా వచ్చింది. నంబర్ 23కి పడిపోయింది. అందువల్ల ఈసారి అన్ని అస్త్రాలు ఫుల్ గా వాడేయాలని బాబు కూడా తయారుగా ఉన్నారు. జనసేనాని పవన్ కళ్యాణ్ అయితే ఎన్నికలు అంటే యుద్ధమే అని పార్టీ వారికి చెబుతున్నారు. వైసీపీ వైఖరి చూస్తూంటే వచ్చే ఎన్నికలు మామూలుగా జరవవు అన్న అనుమానాన్ని ఆయన వ్యక్తం చేస్తున్నారు.

ఏది ఎలా జరిగినా అన్నింటికీ సిద్ధపడే క్యాడర్ ముందుకు రావాలని చివరి కంటా పోరాడాలని ఆయన పిలుపు ఇస్తున్నారు. నిజమే. ఏపీలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే పదవుల మీద ఆశ లేదు అని అంటున్నారు. కానీ అటు జగన్ కానీ ఇటు బాబు కానీ అధికారం కోసం అంతా ఒడ్డాలని చూస్తున్నారు.

ఒకరేమో చేతిలో ఉన్న అధికారాన్ని జారవిడుచుకోరాదని భావిస్తూంటే మరొకరేమో మళ్లీ అధికారం చేతిలోకి తెచ్చుకుందామని చూస్తున్నారు. ప్రజలు తనను ఎన్నుకుంటే తానే సీఎం అని పవన్ అంటున్నారు. ఆయన లెక్కలు ఆయనకు ఉన్నాయి. ఇవన్నీ చూస్తూంటే పదహారు నెలల ముందు నుంచే ఆయుధాలు అన్నీ అధినేతలు బయటకు తీస్తూంటే చూస్తున్న ప్రజానీకానికి కూడా ఈసారి ఎన్నికలు మామూలుగా జరగవు అనే అనిపిస్తోంది.

మరి 2024 ఎన్నికలు దేశమంతా ఏపీ వైపు చూసేలా సాగుతాయా. టైట్ ఫైట్ నడుస్తుందా. విన్నర్ అయినా అపొజైషన్ అయినా అతి స్వల్ప తేడా ఉంటుందా. ఓట్ షేరింగ్ లో కూడా స్లైట్ మార్జిన్ ఉంటుందా. అంటే ఇప్పటికైతే ఏ పార్టీకి వన్ సైడెడ్ గా వేవ్ కనిపించడంలేదు కాబట్టి అదే జరుగుతుంది అనుకోవాలి. అలాంటి పరిస్థితి కనుక 2024 ఎన్నికల ముందు దాకా ఉంటే కనుక భీకరమైన యుద్ధానే అంతా చూస్తారు అన్న విశ్లేషణలు ఉన్నాయి మరి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.