Begin typing your search above and press return to search.
ఆ ఊరంతా యూట్యూబ్ మీద పడి బతికేస్తున్నారు.
By: Tupaki Desk | 2 Sep 2022 1:30 AM GMTయూట్యూబ్ లో ఆయా గ్రామాల ముచ్చట్లు, కామెడీ బిట్స్ ఇటీవల కాలంలో పోటెత్తుతున్నాయి. ఎక్కువగా కామెడీ షార్ట్ స్టోరీస్ కే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇదొక ఆదాయ వనరు కూడా అయిపోయింది. అందుకే కొంచెం క్రియేటివ్ గా ఆలోచించే వారంతా యూట్యూబ్ వీడియోలు చేస్తున్నారు.
సోషల్ మీడియా వినియోగం కొందరికీ వినోదాన్ని అందిస్తే.. మరికొందరికీ ఉపాధి కల్పిస్తోంది. కొందరు సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేస్తూ లక్షల్లో సంపాదిస్తూ ఔరాచ అనిపిస్తున్నారు.
ఇలాంటి వారే చత్తీస్ గఢ్ లోని తులసీ అనే గ్రామంలో ఉన్నారు. ఇక్కడ దాదాపు 1000 మంది యూట్యూబ్ ద్వారా నెలకు రూ.30వేలకు పైగా సంపాదిస్తున్నారంటే అతిశయోక్తి కాదు.
ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లోని దాదాపు 3,000 మంది జనాభా ఉన్న తులసి గ్రామాన్ని 'యూట్యూబర్స్' హబ్‌గా మార్చేశారు. సోషల్ మీడియా అవగాహన ఉన్న వారందరికీ ఈ గ్రామం గురించిన వీడియోలు చిరపరిచితమే. దాదాపు 40 యూట్యూబ్ ఛానెల్‌లతో తులసి గ్రామం వీడియోల ద్వారా డబ్బు సంపాదించే కళను నేర్చుకుంది. దాని చుట్టూ ఉన్న సాంప్రదాయ వృత్తులు వీరి వీడియోలకు ఆయువు పట్టులా మారాయి..
చాలా మంది తమ ఉద్యోగాలను విడిచిపెట్టి మరీ వారి యూట్యూబ్ ఛానెల్‌ల నుండి వచ్చిన జీతం కంటే కూడా రెండు మూడు రెట్లు ఎక్కువ సంపాదిస్తున్నారు. ఇవి వినోదం మాత్రమే కాకుండా విద్యలో మెళకువలు నేర్పే చానెల్స్ కూడా ఉన్నాయి. స్థానికులు కంటెంట్ సృష్టికర్తలుగా ఎదగడంతో ఈ గ్రామంలోని చాలా మంది ఈ వీడియోలు తయారీలోనే పాలు పంచుకుంటూ సంపాదిస్తున్నారు.
ఒక దశాబ్దం క్రితం ఇద్దరు మిత్రులు ప్రారంభించిన ఈ యూట్యూబ్ ప్రయాణంలో గ్రామస్తులు ప్రతిబంధకాలను అధిగమించి కళను అందరికీ పంచడంలో విజయం సాధించారు. వారి స్ఫూర్తితో గ్రామంలోని యువకులంతా ఇప్పుడు యూట్యూబ్ వీడియోలు చేయడంపైనే దృష్టిసారించారు.
ప్రపంచంలో 200 కోట్ల మందికిపైగా యూట్యూబ్ వీడియోలు చూస్తున్నారు. యూట్యూబ్ ద్వారా ఏటా రూ.100 కోట్లకు పైగా డబ్బు సంపాదించేవారూ ఈ ప్రపంచంలో ఉన్నారు. యూట్యూబ్ చెప్పిన రూల్స్ పాటించాలి. మీకు ఫేస్ బుక్, ట్విట్టర్, జీమెయిల్, ఇన్ స్టాగ్రామ్, షేర్ చాట్ అకౌంట్లు ఉంటే ఇంకా ప్రయోజనం ఉంటుంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.