Begin typing your search above and press return to search.

40 ఏళ్ల క్రితం ఇదే రోజు.. తెలుగు రాజకీయాలు మారిన రోజు

By:  Tupaki Desk   |   9 Jan 2023 4:13 AM GMT
40 ఏళ్ల క్రితం ఇదే రోజు.. తెలుగు రాజకీయాలు మారిన రోజు
X
నలభై ఏళ్ల క్రితం.. సరిగ్గా ఇదే రోజు.. తెలుగు ప్రాంతంలో ఒక అద్భుతం చోటు చేసుకుంది. ఆ మాటకు వస్తే.. అదే తెలుగు ప్రాంతాల్లో రాజకీయ చైతన్యానికి కొత్త బీజాల్ని నాటింది. అంతేనా.. యావత్ దేశం సైతం ఒకసారి ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలా చేసింది. ఇంతకీ నలబై ఏళ్ల క్రితం ఇదే రోజున ఏం జరిగిందంటే.. తెలుగువారి ఆరాధ్య దైవం.. వెండితెర మీద కనిపించినంతనే హారతులు పెట్టే ప్రజలు.. రాజకీయ పార్టీ పెట్టిన తొమ్మిది నెలలకే అధికారాన్ని చేతికి ఇవ్వటం.. ఇదే రోజున స్వర్గీయ నందమూరి తారక రామారావు ముఖ్యమంత్రిగా ఇదే రోజున ప్రమాణ స్వీకారం చేశారు.

టీడీపీ వ్యవస్థాపకుడిగా వ్యవహరించిన ఆయన ఉమ్మడి ఏపీకి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు.. మరో పద్నాలుగు మంది మంత్రులుగా ఆయనతో పాటు ప్రమాణ స్వీకారం చేశారు. తెలుగు రాజకీయాల్లో పెను మార్పు మాత్రమే కాదు.. కొత్త పంథాకు నాంది పలికిన రోజుగా చెప్పాలి. అప్పటివరకు రాజకీయం అంటే.. కొందరికి మాత్రమే సొంతమైనదన్న దాని నుంచి.. సగటు జీవి సైతం రాజకీయం వైపు చూడటం మొదలు పెట్టిన రోజుగా చెప్పాలి.

నాడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన ఎన్టీఆర్.. ఏయే శాఖల్ని తనతో అట్టి పెట్టుకున్నారు? తనతో పాటు మంత్రులుగా ఎవరిని ప్రమాణ స్వీకారం చేయించారు? వారికి ఏయే శాఖల్ని కట్టి పెట్టారన్నది చూసినప్పుడు ఒకరిద్దరు మినహా మిగిలిన వారంతా రాజకీయాలకు దూరమైన విషయం కనిపిస్తుంది. నాటి రోజులకు వెళితే..

నందమూరి తారక రామారావు
ముఖ్యమంత్రి, హోం.. శాంతి భద్రతలు.. పరిపాలన.. సమాచారం.. భారీ పరిశ్రమలు.. ప్రణాళిక.. తదితరాలు
నాదెండ్ల భాస్కరరావు
ఆర్థిక శాఖ, వాణిజ్య పన్నులు.. ఇంధన శాఖ
మహేంద్రనాథ్
రెవెన్యూ, పౌర సరఫరాలు
నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి
ప్రజా పనులు, నీటి పారుదల
కరణం రామచంద్రరావు
పంచాయితీ రాజ్
ఎస్ సత్యనారాయణ
రవాణా
పూసపాటి ఆనందగజపతి రాజు
విద్య
ఎస్. రాము మునిరెడ్డి
వైద్య, ఆరోగ్యం
ఎం రామచంద్రరావు
కార్మిక, ఉపాధి
జీవన్ రెడ్డి
ఎక్సైజ్
ఇ. అంజనేయులు
దేవాదాయ
కుందూరు జానారెడ్డి
వ్యవసాయం, సహకార
ప్రతిభా భారతి
సాంఘిక సంక్షేమం
యనవమల రామక్రిష్ణుడు
న్యాయ, మున్సిపల్ పరిపాలన
మహమ్మద్ షకీర్
పర్యాటకం, వక్ఫ్


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.