Begin typing your search above and press return to search.
హేవిళంబి టీడీపీకి కష్టాల సంవత్సరమా?
By: Tupaki Desk | 11 May 2017 11:28 AM GMTహేవిళంబి నామ సంవత్సరం టీడీపీ నేతలకు బాగా ఇబ్బందికరంగా ఉందని పండితులు అంటున్నారు. ముఖ్యంగా టీడీపీ నేతలకు వ్యక్తిగత ఇబ్బందులు అధికంగా ఉన్నాయని చెబుతున్నారు. నేతల ఆరోగ్యం, కుటుంబసభ్యులకు ప్రమాదాలు వంటివి జరుగుతుండడంతో ఈ ఏడాది టీడీపీ నేతలకు కలిసిరావడం కష్టమేనని చెబుతున్నారు.
టీడీపీ నేతలు వరుసగా తీవ్ర అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. తాజాగా ఏపీమంత్రి అయ్యన్నపాత్రుడు అస్వస్థతకు గురయ్యారు. తన మనవడి పుట‍్టెంట్రుకలు తీసే కార‍్యక్రమానికి ఆయన కుటుంబసభ్యులతో తిరుపతి వచ్చారు. గురువారం ఉదయం ఆయన శ‍్వాసతీసుకోవడంలో ఇబ‍్బందిపడ్డారు. దీంతో మంత్రిని కుటుంబసభ‍్యులు హుటాహుటిన రుయా ఆస‍్పత్రికి తరలించారు. అక‍్కడ వైద్యులు వైద‍్య పరీక్షలు నిర‍్వహించారు.
రెండు రోజుల కిందట శ్రీకాకుళం జిల్లా పలాస ఎమ్మెల్యే శివాజీ కూడా అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. ఆయనకూ చికిత్స అందిస్తున్నారు. ఇదే సమయంలో తెలంగాణకు చెందిన సీనియర్ టీడీపీ నేత దేవేందర్ గౌడ్ కూడా అమెరికాలో చికిత్స తీసుకుంటున్నారు. ఆయన్ను చంద్రబాబు పరామర్శించారు. దేవేందర్ గౌడ్ చాలాకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు.
మరోవైపు ఏపీ మంత్రి నారాయణ కుటుంబానికి కూడా తీవ్ర విషాదం ఎదురైంది. ఆయన కుమారుడు యాక్సిడెంట్లో మరణించారు. టీడీపీ నేతలకు ఈ ఏడాది అంతగా బాగుండకపోవడంతోనే ఈ సమస్యలు వస్తున్నాయంటూ సోషల్ మీడియాలో పలువురు అభిప్రాయపడుతున్నారు.