Begin typing your search above and press return to search.
లోకేశ్ మాట!... నాలోనూ తప్పులున్నాయి!
By: Tupaki Desk | 6 Sep 2017 7:20 AM GMTఏపీలో అధికార పార్టీ టీడీపీకి జాతీయ ప్రధాన కార్యదర్శిగా కీలక బాధ్యతలతో పాటు తన తండ్రి నారా చంద్రబాబునాయుడి కేబినెట్‌లో కీలక శాఖల మంత్రిగా వ్యవహరిస్తున్న నారా లోకేశ్... రెండింటినీ సమన్వయం చేసుకునే క్రమంలో పలు ఇబ్బందులు పడుతున్నారు. అప్పటిదాకా అంతగా బయటకు రాని లోకేశ్... ఒకేసారీ పార్టీ కీలక బాధ్యతలు చేపట్టిన దరిమిలా బయటకు రాక తప్పలేదు. ఆ తర్వాత తండ్రి వారసత్వం అందుకునే క్రమంలో ఆయన కేబినెట్ మంత్రిగానూ పదవీ బాధ్యతలు చేపట్టక తప్పలేదు. ఈ సందర్భంగా చట్టసభల్లోకి లోకేశ్ ఇచ్చిన దొడ్డిదారి ఎంట్రీపై పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగాయి. ఓ రాజకీయ పార్టీ అధినేత కుమారుడిగానే కాకుండా... రాష్ట్ర సీఎం సుపుత్రుడిగా ఉన్న లోకేశ్ ప్రజా క్షేత్రంలోకి దిగకుండానే ఎమ్మెల్సీగా పదవీ బాధ్యతలు చేపట్టాల్సిన అగత్యం ఏమొచ్చిందన్న ప్రశ్నలు కూడా వినిపించాయి.
అయితే ఇవేవీ పట్టని లోకేశ్... తన తండ్రి చూపిన పరోక్ష ఎన్నిక ద్వారానే చట్టసభల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇక ఆ తర్వాత మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ప్రమాణ స్వీకారం నాడే తడబడిన వైనం ఆయన పటుత్వంపై ప్రశ్నలను రేకెత్తించింది. జనం అనుమానాలను నిజం చేస్తున్న వాడల్లే పలు కీలక సందర్భాల్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన లోకేశ్ భారీ అపకీర్తినే మూటగట్టుకున్నారు. అయినా ఇప్పుడిదంతా ఎందుకనేగా మీ ప్రశ్న? అక్కడికే వస్తున్నాం. ఎన్నిసార్లు నాలుక మడత పడినా... సదరు కామెంట్లపై జోకులు పేలినా పెద్దగా పట్టించుకోని లోకేశ్... ఇప్పుడు తనలోనూ తప్పులున్నాయంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నిన్న గుంటూరు జిల్లా పరిధిలోని హ్యాపీ రిసార్ట్స్‌లో జరిగిన పార్టీ శిక్షణా తరగతుల్లో భాగంగా ప్రసంగించిన లోకేశ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
*నాలోని ఉన్న లోపాలేమిటో ఇప్పుడు తెలిశాయి. ప్రతి మనిషిలోనూ లోపాలు ఉంటాయి. అయితే ఆ లోపాలను సవరించుకోగలిగినంత వరకు సవరించుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. నేను కూడా ఈ పరీక్షలో పాల్గొని విశ్లేషణ తీసుకున్నాను.ఈ వ్యక్తిత్వ విశ్లేషణ పరీక్ష ద్వారా తాను తెలుసుకున్న లోపాలను సవరించుకునేందుకు మనస్తత్వ విశ్లేషకుడి వద్దకు శిక్షణ కోసం వెళ్తున్నాను. ఈ వ్యక్తిత్వ విశ్లేషణ పరీక్ష ఇచ్చిన ఫలితాలు బాగుంటే పార్టీలో కీలంగా వ్యవహరించే గ్రామ స్థాయి నేతల వరకు ఈ పరీక్షను నిర్వహించాలని హైకమాండ్ భావిస్తోంది* అని లోకేష్ పేర్కొన్నారు. సో... తనలోని లోపాలను సవరించుకునేందుకు లోకేశ్ మనస్తత్వ విశ్లేషకుడి వద్దకు వెళుతున్న మాట వాస్తవేనన్న మాట. ఇలాగైనా లోకేశ్ తనలోని తప్పులను సరిదిద్దికుని మెరుగైన పనితీరు కనబరచాలని మనమూ కోరుకుందాం.
--